Bihar Elections - AI Video: బిహార్ ఎన్నికల్లో ఏఐ వీడియోల వినియోగంపై ఈసీ నిషేధం
ABN , Publish Date - Oct 09 , 2025 | 08:55 PM
ప్రత్యర్థి పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఏఐ వీడియోలతో ప్రచారం నిర్వహించడంపై ఈసీ నిషేధం విధించింది. ఏఐ సాంకేతికత దుర్వినియోగం కావొద్దన్నదే తమ అభిమతమని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల్లో ఏఐ వీడియోల వినియోగంపైన ఎలక్షన్ కమిషన్ తాజాగా ఆంక్షలు విధించింది. అభ్యర్థులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఏఐ వీడియోలతో ఎలాంటి ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా ఈ చర్య తీసుకున్నట్టు చెప్పింది. కృత్రిమ మేధ దుర్వినియోగం కాకూడదని పేర్కొంది. ఏఐతో తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి చర్యలకూ దూరంగా ఉండాలని పేర్కొంది. ఇతర సందర్భాల్లో ఏఐ వాడిన సమయంలో ఈ విషయాన్ని ఆయా డిజిటల్ కంటెంట్‌పై కనబడేనలా చూపించాలని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. సోషల్ మీడియాపై దృష్టి పెట్టేందుకు ఇప్పటికే ఈసీ పలు చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది (Ban AI videos Bihar Elections).
ఈసీ తాజా ప్రకటనతో ఏఐ వీడియోలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో(ఎమ్‌సీసీ) పరిధిలోకి వచ్చాయి. దీంతో, ఏఐకి సంబంధించిన నిబంధనలకు అన్ని పార్టీలు కచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఎమ్‌సీసీ ప్రకారం, ఇతర పార్టీల ప్రోగ్రామ్‌లు, విధానాలపైనే రాజకీయ కామెంట్స్‌ను పరిమితం కావాలి. వ్యక్తిగత జీవితాలు, ప్రజాజీవితంతో నిమిత్తం లేని అంశాలను ప్రచారంలో వినియోగించకూడదు. వాస్తవాలను వక్రీకరించడం, తప్పుడు ఆరోపణలు గుప్పించడం కూడా చేయకూడదు. నవంబర్ 6 - 11 తేదీ మధ్య బిహార్ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 14న తుది ఫలితాలను విడుదల చేస్తారు. ఈసారి ఎన్నికల నిర్వహణలో సుమారు 8.5 లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి:
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు.. కర్ణాటక కేబినెట్ ఆమోదం
ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య.. డీజీపీ విషయంలో హర్యానా కీలక నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి