Delhi Dust Strom: ఒక్కసారిగా మారిన వాతావరణం.. విరుచుకుపడిన దుమ్ము తుఫాను, వర్షాలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 09:19 PM
భారత వాతావరణ శాఖ ముందుగానే ఢిల్లీలోని గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని ఐఎండీ తెలిపింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారంనాడు అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్రమైన ఉష్ణతాపం మధ్య ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో ఒక్కసారిగా దుమ్ము తుఫాను రేగడం, ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పెనుగాలులతో చెట్టు ఊగిపోవడం, వర్షాలతో వాహనాలు రహదార్లపై చిక్కుకుపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఘజియాబాద్, నొయిడా, గ్రేటర్ నొయిడా సహా ఎన్‌సీఆర్‌లో బలమైన ఈదురు గాలులు వీచాయి.
Tahawwur Rana Extradition: రాణా ఆట కట్టించిన ఐపీఎస్.. కసబ్‌తో తలపడింది కూడా ఈయనే
కాగా, భారత వాతావరణ శాఖ ముందుగానే ఢిల్లీలోని గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని ఐఎండీ తెలిపింది.
ఎయిర్ క్వాలిటీ ఇలా..
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు డాటా ప్రకారం, ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా (poor quality) ఉంది. ఉదయం 9 గంటలకు ఏక్యూఐ 243 వద్ద స్ధిరపడటంతో గాలి నాణ్యత పేలవమైన విభాగంలో నమోదైంది. కాగా, శుక్రవారం కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని, కనీష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్షియస్‌కు పడిపోవచ్చని వాతావరణ శాఖ కార్యాలయం తెలిపింది.
ఇవి కూడా చదవండి..