Share News

Tahawwur Rana Extradition: రాణా ఆట కట్టించిన ఐపీఎస్.. కసబ్‌తో తలపడింది కూడా ఈయనే

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:57 PM

రాణా అప్పగింత భారతదేశ కీలక దౌత్యవిజయంగా చెప్పుకోవాలి. అయితే దీని వెనుక తన వాదనను బలంగా వినిపించి రాణాను అప్పగించేందుకు అమెరికా కోర్టును ఒప్పించడంలో ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి కీలకంగా వ్యవహరించారు.

Tahawwur Rana Extradition: రాణా ఆట కట్టించిన ఐపీఎస్.. కసబ్‌తో తలపడింది కూడా ఈయనే

న్యూఢిల్లీ: ఎట్టకేలకు 2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ రాణా (Tahawwur Rana) ఆటకట్టింది. అమెరికాలో చట్టపరమైన దారులన్నీ మూసుకుపోవడంతో ఇండియాకు అప్పగించేందుకు అమెరికా అంగీకరించడం, ప్రత్యేక విమానంలో ఆయనను ఢిల్లీకి తీసుకురావడం వంటి పరిణమాలు శరవేగంగా చోటుచేసుకున్నాయి. రాణా అప్పగింత భారతదేశ కీలక దౌత్యవిజయంగా చెప్పుకోవాలి. అయితే దీని వెనుక తన వాదనను బలంగా వినిపించి రాణాను అప్పగించేందుకు అమెరికా కోర్టును ఒప్పించడంలో ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు రాణాను ఇండియాకు తీసుకురావడంతో ఆయనను మొదటిసారిగా ఇంటరాగేట్ చేయనున్న పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారి కూడా ఆయనే. ముంబై దాడుల సమయంలో కసబ్‌తో మొదటిగా తలపడింది కూడా ఆయనే కావడం విశేషం. అప్పట్లో ముంబై సెంట్రల్ ప్రాంతం అడిషనల్ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఆయన...ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చీఫ్‌గా ఉన్నారు. ఆయనే సదానంద్ దాతే (Sadanand Date).

Tahawwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా


కసబ్‌తో తలపడి, మృత్యువు అంచుల వరకూ వెళ్లి..

అది 2008, నవంబర్ 26. ముంబై నగరం వరుస ఉగ్రదాడుల్లో చిక్కుకుంది. ఏం జరుగుతోందో, ఏ ప్రాంతంలో పేలుడు జరుగుతుందో తెలియని గందరగోళం. అప్పట్లో ముంబై సెంట్రల్ అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్న సదానంద్ దాతే వెంటనే అప్రమత్తమయ్యారు. నిజానికి దక్షిణ ప్రాంతంలో దాడులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ఆయన మలబాల్ హిల్స్‌లోని తన నివాసం నుంచి హుటాహుటిన సీఎస్‌టీ స్టేషన్‌కు బయలుదేరారు. మధ్యలో ఒక పోలీస్ స్టేషన్ వద్ద ఆగి కార్బైన్‌తో సహా ఆయుధాలు తీసుకుని తనతో పాటు ఆరుగురు అధికారులు వెంటబెట్టుకుని వెళ్లారు.


సీఎస్‌టీ స్టేషన్‌ను చేరుకోగానే ఇద్దరు ఉగ్రవాదులు Cama, Albless ఆసుపత్రిలోకి చొరబడ్డారనే సమాచారం అందింది. అది మహిళలు, చిన్నారుల చికిత్సా కేంద్రం కావడంతో ఉగ్రవాదులు వారిని బందీలుగా పట్టుకుని ఉండొచ్చని గ్రహించిన దాతే వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ ఇద్దరు ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్తాయిల్ అని ఆ తర్వాత నిర్ధారణ అయింది. ఆసుపత్రి పైకప్పు (రూఫ్‌టాప్) నుంచి ఉగ్రవాదులు విచాక్షణారహితంగా కాల్పులకు దిగారు. దాతే ఎదురుకాల్పులు జరిపినప్పటికీ టార్గెట్ దూరంగా ఉడటం, పైనుంచి కాల్పులు కావడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. కసబ్ (ఆ తర్వాత గుర్తించారు) పైనుంచి విసిరిన గ్రెనేడ్ దాతేకి సరిగ్గా మూడడుగుల దూరంలో పడింది. దాతే టీమ్‌లోని సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ మోరే అక్కడికక్కడే మృతి చెందగా, దాతే, మరో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ చికిత్సకు నిరాకరించిన దాతే ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగించారు.


సరిగ్గా 40 నిమిషాల తర్వాత.. ఆసుపత్రిలోని ఆరవ అంతస్తు వరకూ దాతే చేరుకున్నారు. రూఫ్‌టాప్ చేరడానికి దారితీసే మెట్ల దగ్గర నుంచి ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు మరో గ్రెనేడ్ విసిరారు. అది ఆయనకు సమీపంలోనే పేలడంతో కాళ్లు, ముఖానికీ తీవ్రగాయాలై రక్తస్రావం జరిగింది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు.


సాహసి.. అంచెలంచెలుగా..

దాతే సాహసానికి మారుపేరుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుని అంచెలంచెలుగా ఎన్ఐఏ చీఫ్ స్థాయికి ఎదిగారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించారు. తొలినాళ్లలో పేపర్ బాయ్‌గా పనిచేయగా, ఆయన తల్లి పనిమనిషిగా పనిచేశారు. ఆ తర్వాత క్రమంలో ముంబై పోలీసు శాఖలో, సీబీఐలో, మహారాష్ట్ర ఏటీఎస్‌లో దాతే కీలక సేవలు అందించారు. మిరా-భయందర్-వసాయి-విరార్ ప్రాంతం తొలి పోలీస్ కమిషనర్ కూడా ఆయనే. ముంబై దాడుల సమయంలో ఆయన చూపించిన తెగువ, సాహసానికి గాను ధైర్యసాహసాలకు ఇచ్చే ప్రెసిడెంట్ గాలంటరీ మెడల్ అందుకున్నారు. ఏడాది క్రితమే ఎన్ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దాతే నియమితులయ్యారు. 17 ఏళ్ల క్రితం మృత్యువు అంచులవరకు వెళ్లిన ముంబై దాడుల కేసులో ప్రమేయం ఉన్న రాణాను ఇప్పుడు ప్రశ్నించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Tahawwur Rana Extradition: తహవ్వుర్ రాణా కెనడా పౌరుడే.. పాక్ బుకాయింపు

Maoist Party: చర్చలపై ప్రకటన విడుదల..

Ramdev Baba: మరో కాంట్రవర్సీలో రాందేవ్ బాబా.. ఈసారి షర్బత్ జిహాద్

Updated Date - Apr 10 , 2025 | 05:00 PM