Minister: ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తాం..
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:00 AM
ట్రెండ్ మారిన ‘తమిళనాడు ఇన్ యూనిట్’ అనే ప్రచారం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోనున్నట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్ తెలిపారు.
- డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్
చెన్నై: ట్రెండ్ మారిన ‘తమిళనాడు ఇన్ యూనిట్’ అనే ప్రచారం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోనున్నట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్(Minister Duraimurugan) తెలిపారు. డీఎంకే ఆధ్వర్యంలో 45 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
వేలూరు(Veluru)లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దురై మురుగన్ మీడియాతో మాట్లాడుతూ...ఈ ప్రచార కార్యక్రమంలో అన్ని సారూప్య అభిప్రాయాలు కలిగిన వారిని కలుసుకుని పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అమలుచేస్తున్న పథకాలు వివరించనున్నామన్నారు.

ప్రజలను కలుసుకున్న సమయంలో వారు తెలిపే అభిప్రాయాలను నేతలు, కార్యకర్తలు నమోదుచేసుకోవాలన్నారు. ప్రజలు చెప్పే సమస్యలు, సలహాలు, సూచనలను శ్రద్ధగా వినాలని పార్టీ శ్రేణులకు దురైమురుగన్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి
Read Latest Telangana News and National News