Operation Sindooor: రాఫెల్ ఫైటర్ జెట్‌ను మనం కోల్పోయామా... మిలట్రీ ఏం చెప్పిందంటే
ABN , Publish Date - May 11 , 2025 | 09:29 PM
పాక్ ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నిర్వహించినట్టు భారత సైన్యం శుక్రవారం వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ ప్రభావం, సాధించిన విజయాలు, ఏ ఉద్దేశంతో ఆపరేషన్ ప్రారంభించామనే వివరాలను సమగ్రంగా వివరించింది.
న్యూఢిల్లీ: పాక్ ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నిర్వహించినట్టు భారత సైన్యం శుక్రవారం వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ ప్రభావం, సాధించిన విజయాలు, ఏ ఉద్దేశంతో ఆపరేషన్ ప్రారంభించామనే వివరాలను సమగ్రంగా వివరించింది. ఎయిర్ మార్షల్ ఏకే భార్తి, డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘై, మేజర్ జనరల్ ఎస్ఎస్ శర్మ, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిర్ మార్షల్ ఏకే భార్తికి మీడియా నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం.. భారత సైన్యం..
ఆపరేషన్ సింధూర్‌లో మన రాఫెల్ ఫైటర్ జెట్ కూలిపోయినట్టు వస్తున్న వార్తలపై ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా, ఆయన అవునని కానీ కాదని కానీ ఆయన సూటి సమాధానం ఇవ్వలేదు. ఏ యుద్ధం జరిగినా ఎంతో కొంత నష్టం సహజమేనని భార్తి సమాధానమిచ్చారు. ''మనం యుద్ధ పరిస్థితిల్లో ఉన్నాం. నష్టం కూడా అందులో భాగమే. అనుకున్న లక్ష్యా్న్ని సాధించామా లేదా అనేదే అసలైన ప్రశ్న. దీనికి సాధించామన్నదే నా సమాధానం'' అని చెప్పారు. ఇప్పుటికీ యుద్ధం ముగింటే మనం ఉన్నందున దీనిపై ఇంతకు మించి తాను వ్యాఖ్యానించలేనని అన్నారు. పైలట్లందరూ క్షేమంగా వెనక్కి వచ్చారని చెప్పారు. మే 7 నుంచి మే 10 వరకూ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చిన్న ఆయుధాలు, ఆర్టిలరీ దాడుల్లో సుమారు 35 నుంచి 40 మంది పాక్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి