Delhi Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాల్ని ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లిన బస్సు
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:40 AM
ఢిల్లీలోని షాహదార ప్రాంతంలో మూడు వాహనాల్ని ఓ బస్సు ఢీకొట్టుకుంటూ దూసుకెళ్ళింది. విశ్వాస్‌నగర్‌లో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా వేగం పుంజుకున్న DTC బస్సు.. నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టింది.స్కూల్ వ్యాన్, ఆటో రిక్షా, ఓ బైక్‌ని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్ళింది.
దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రద్దీ ఉన్న సమయంలో వాహనాలు అత్యధిక వేగంతో పోవడం, మద్యం సేవించి వాహనాలు నడపటం, రోడ్డుపై ఆకతాయిలు నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనే రూల్స్ తీసుకొచ్చినప్పటికీ కట్టడి చేయలేకపోతున్నారు. కొందరి అజాగ్రత్త వలన సామాన్యులు బలి అవుతున్నారు. క్షణాల్లో జరిగిన రోడ్డు ప్రమాదం కుటుంబాలని కుదిపేస్తోంది. తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాహదార ప్రాంతంలో మూడు వాహనాల్ని ఓ బస్సు ఢీకొట్టుకుంటూ దూసుకెళ్ళింది. విశ్వాస్‌నగర్‌లో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా వేగం పుంజుకున్న DTC బస్సు.. నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టింది.స్కూల్ వ్యాన్, ఆటో రిక్షా, ఓ బైక్‌ని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరార్ అయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, కొద్దీ సమయంలోనే అతడిని పట్టుకున్నారు. సీసీటీవీలో వీడియో రికార్డ్ కావడంతో పోలీసులు ఆ వీడియోను రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్ కేసులో కౌంటర్ వేయండి
Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్