Mustafabad: ముస్లింల ఖిల్లా ముస్తఫాబాద్‌లో చక్రం తిప్పిన బీజేపీ
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:25 PM
ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న ముస్తఫాబాద్ (Mustafabad)లో బీజేపీ ఈసారి చక్రం తప్పింది. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిస్ట్ తన సమీప ప్రత్యర్థిపై 42,000కు పైగా ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయాన్ని ఖరారు చేసుకున్నారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (BJP) హవా కొనసాగిస్తోంది. మెజారిటీ మార్క్‌ను దాటి 46 సీట్లలో విజయానికి మార్గం సుగమం చేసుకుంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న ముస్తఫాబాద్ (Mustafabad)లో బీజేపీ ఈసారి చక్రం తప్పింది. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిస్ట్ తన సమీప ప్రత్యర్థిపై 42,000కు పైగా ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయాన్ని ఖరారు చేసుకున్నారు.
Delhi Election Result: ఆ ఒక్క మాట ఆప్ కొంప ముంచిందా..
నియోజకవర్గం మార్చినా...
మోహన్ సింగ్ బిస్ట్ ప్రస్తుతం కర్హాల్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కపిల్ మిశ్రాను ఈసారి కర్హాల్ నగర్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బీజేపీ నిలిపింది. దీంతో మోహన్ సింగ్ బిస్ట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వెంటనే బీజేపీ మరో జాబితా విడుదల చేస్తూ ముస్తఫాబాద్ సెగ్మంట్ నుంచి ఆయనను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
డీలిమిటేషన్ కమిషన్ సిఫారసులతో 2008లో ముస్తఫాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. 2008, 2013లో కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. తొలి ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసన్ అహ్మద్‌పై కాంగ్రెస్ అభ్యర్థి హసన్ అహ్మద్ 978 ఓట్ల అధిక్యంతో గెలిచారు. 2013లో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్‌పై 2,000 ఓట్ల ఆధిక్యంతో హసన్ గెలిచారు. 2019లో కాంగ్రెస్, బీజేపీ ఆధిపత్యానికి 'ఆప్' గండికొట్టింది. బీజేపీ అభ్యర్థి ప్రధాన్, హసన్ కుమారుడు అలి మెహన్దిని ఆప్ అభ్యర్థి చిత్తుచేశారు.
కాగా, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్తఫాబాద్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు అడిల్ అహ్మద్ ఖాన్ పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా అలి మేహంది, బీజేపీ నుంచి మోహన్ సింగ్ బిస్ట్ పోటీ చేశారు. ఎంఐఎం సైతం తమ అభ్యర్థిగా ఢిల్లీ అల్లర్ల నిందితుడు తాహిర్ హుస్సేన్‌ను బరిలోకి దింపింది.
Also Read:
ఢిల్లీ సీఎం అతడే..అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..
ఢిల్లీ ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
For More National News and Telugu News..