Delhi: ప్రొటెం స్పీకర్‌గా అరవింద్ సింగ్ లవ్లీ.. ఎల్జీ నియామకం
ABN , Publish Date - Feb 22 , 2025 | 07:28 PM
ఢిల్లీ అసెంబ్లీ బులిటెన్ ప్రకారం, ఫిబ్రవరి 25న అసెంబ్లీని ఉద్దేశించి ఎల్జీ సక్సేనా మాట్లాడతారు. అనంతరం కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికను సభలో ప్రవేశపెడతారు. 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఎల్జీ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) నేత అరవింద్ సింగ్ లవ్లీని ప్రొటెం స్పీకర్ (Protem Speaker)గా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా శనివారంనాడు నియమించారు. ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ఈనెల 24వ తేదీ సోమవారంనాడు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. దీనికి ముందు ఉదయం 11 గంటలకు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుంది.
Shaktikanta Das: మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా శక్తికాంత దాస్
ఢిల్లీ అసెంబ్లీ బులిటెన్ ప్రకారం, ఫిబ్రవరి 25న అసెంబ్లీని ఉద్దేశించి ఎల్జీ సక్సేనా మాట్లాడతారు. అనంతరం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికను సభలో ప్రవేశపెడతారు. 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఎల్జీ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. అనంతరం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా గురువారంనాడు ప్రమాణస్వీకారం చేసిన రేఖా గుప్తా ఆ తర్వాత కొద్ది గంటలకే తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రెండు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని, అసెంబ్లీ తొలి సమావేశంలో 14 కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెట్టాలని నిర్ణియించినట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.