Delhi Air Pollution: వామ్మో.. ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయుకాలుష్యం
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:50 AM
ఢిల్లీలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా నమోదైంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు ఢిల్లీలో వాయి నాణ్యత 471 పాయింట్లుగా నమోదు అయ్యింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం (Delhi Air Pollution) కమ్మేసింది. ఢిల్లీ గాలిలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజధానిలో ప్రజలు టపాకాయలతో హోరెత్తించారు. దీపావళి పండుగను ఢిల్లీ వాసులు ఘనంగా జరుపుకున్నారు. అయితే పండల సెలబ్రేషన్స్ అనంతరం ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సెంటర్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 ను అమలు చేస్తోంది. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా నమోదైంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు ఢిల్లీలో వాయి నాణ్యత 471 పాయింట్లుగా నమోదు అయ్యింది. దీనిని వెరీ పూర్ కేటగిరీకి గాలి నాణ్యత సూచీ చేరింది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణులు చెబుతున్నారు.
ఈ సారి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదు. పైగా గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదు అయిన 296 ఐక్యూ ఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న సాయంత్రం 4 గంటలకే ఢిల్లీ ఏక్యూ ఐ 400గా వెరీ పూర్ కేటగిరీలో నమోదు అయినట్ల సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోరకాస్టింగ్ అండ్ రీసర్చ్ వెల్లడించింది. ఇక టపాసుల మోతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఇలాంటి కలుషితమైన గాలిని ఎక్కువ సేపు పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాసకోస వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సీపీసీపీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో నమోదైన వాయు కాలుష్య వివరాలు..
మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 371 పాయింట్లుగా నమోదు.
సోనియా విహారలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 371 పాయింట్లుగా నమోదు.
ఆర్కే పురంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 368 పాయింట్లుగా నమోదు.
చాందిని చౌక్‌లో 360 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు.
ఇవి కూడా చదవండి..
వైజాగ్కి గూగుల్ పెట్టుబడి రావడానికి కారణం శాంతి భద్రతలు: సీఎం చంద్రబాబు-
విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..
Read Latest National News And Telugu News