Air India Plane Crash: 787 డ్రీమ్‌లైనర్ లోపభూయిష్టమైనది.. ఏడాది క్రితమే చెప్పిన విజిల్ బ్లోయర్
ABN , Publish Date - Jun 14 , 2025 | 08:01 PM
బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికుల ప్రమాదకరమని సలోహ్‌పోర్ అనే విజిల్‌బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారు. తాజాగా ఇదే విషయాన్ని మాజీ బోయింగ్ అత్యున్నత స్థాయి మేనేజర్ నుంచి విజిల్‌బ్లోయర్‌గా మారిన ఎడ్ పియర్సన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈనెల 12న జరిగిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. విమానంలోని 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన బీజేపీ వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం ధ్వంసం కావడంతో పాటు 24 మంది వరకూ మృతి చెందడటంతో మృతుల సంఖ్య 274కు చేరింది. 2009లో 787-8 డ్రీమ్‌లైనర్ ప్రపంచంలో వాడుకలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన తొలి ప్రమాదం కూడా ఇదే కావడం విశేషం.

ఆసక్తికరంగా, బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికులకు ప్రమాదకరమని సలోహ్‌పోర్ అనే విజిల్‌బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారు. తాజాగా ఇదే విషయాన్ని మాజీ బోయింగ్ అత్యున్నత స్థాయి మేనేజర్ నుంచి విజిల్‌బ్లోయర్‌గా మారిన ఎడ్ పియర్సన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సలేహ్‌పూర్ ఏదయితే సమస్య ఉందని ఆందోళన చొందారో, లోపాల కారణంగా విమానం పదేపదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని చెప్పారో అదే సమస్యే ఎయిర్ ఇండియా విమానం కూలడానికి కారణం కావచ్చని అన్నారు.
సలేహ్‌పూర్ ఏం చెప్పారు?
బోయింగ్‌లో సేఫ్టీ కల్చర్ లేదని సలేహ్‌పూర్ 2024లో యూఎస్ సెనేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికులకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. బోయింగ్ క్వాలిటీ ఇంజనీర్‌గా పనిచేసి ఆయన డ్రీమ్‌లైనర్ల తయారీ, లోపాల కారణంగా విమానం పదేపదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని, సమస్యలను పరిష్కరించకుంటే విమాన ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని తన వాంగూల్మంలో పేర్కొన్నారు. 787 మెయిన్ బాడీ ముఖ్యమైన భాగాల మధ్య ఖాళీలు ఉన్నాయని, ఇందువల్ల రెండు ప్రధాన విమాన జాయింట్లలో సమస్య తలెత్తి సమయానికి ముందే వైఫల్యానికి దారితేసే అవకాశం ఉందని ఆయన తన వాదన వినిపించారు. తన వాదనను బోయింగ్ యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన విజిల్ బ్లోయర్‌గా సమస్యను లేవనెత్తారు.
కాగా, విజిల్ బ్లోయర్ పియర్‌సన్ సైతం 737 మాక్స్ విమానాల విషయంలో గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. కెంపెనీలో ఆందోళనకరమైన, ప్రమాదకరమైన రీతిలో విమానాల ఉత్పత్తి జరుగుతోందని ఆయన హెచ్చరించారు. హడావిడిగా విమానాల నిర్మాణం జరుగుతోందని, ఓవర్‌టైమ్ పనిచేయాలని ఉద్యోగాలపై ఒత్తిడి ఉందని, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, ఫంక్షన్ సిస్టన్, టెస్టింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్ టెస్టింగ్‌లలో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పారు.
విమాన ప్రమాదంపై దర్యాప్తు
అహ్మదాబాద్ విమానం కూలిన ప్రదేశంలో దొరికిన బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాద కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాయిస్, సిస్టమ్ డాటాను విశ్లేషిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోయింగ్ డ్రీమ్‌లైనర్ తొలిసారి కుప్పకూలడానికి కారణాలు ఏమిటో, గతంలో విజియబ్లోయర్స్ నుంచి వ్యక్తమైన హెచ్చరికల్లో నిజమెంతో త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి..
అధిక ఉష్ణోగ్రతల మధ్య డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం.. బాధిత కుటుంబాల ఆందోళన..
నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. ప్రమాదానికి ముందు పైలెట్ చివరి మాటలు ఇవే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి