Share News

Odisha Crocodile Incident: మహిళ దుస్తులు ఉతుక్కుంటుండగా.. నదిలోని మొసలి ఒక్కసారిగా.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:48 PM

ఓడిశాలో ఓ మహిళలను నదిలోకి లాక్కెళ్లిన మొసలి ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జజ్‌పూర్ జిల్లాలో సోమవారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Odisha Crocodile Incident: మహిళ దుస్తులు ఉతుక్కుంటుండగా.. నదిలోని మొసలి ఒక్కసారిగా.. షాకింగ్ వీడియో
crocodile attack Odisha

ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఖరాస్రోటా నదీతీరం వద్ద ఓ మహిళపై అకస్మాత్తుగా దాడి చేసిన మొసలి ఆమెను నోట కరిచి నదిలోకి లాక్కెళ్లిపోయింది. జజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మహిళను కనుగొనేందుకు అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రస్తుతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు (crocodile attack Odisha).

స్థానికంగా నివసించే సౌదామినీ మహాలా (55) దుస్తులు ఉతుక్కునేందుకు నదీ తీరానికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. అకస్మా్త్తుగా దాడి చేసిన మొసలి మహిళను నీటిలోకి లాగేసింది. చుట్టుపక్కల వారు స్పందించే లోపే బాధితురాలిని నీళ్లోకి ఈడ్చుకెళ్లింది. రెప్పపాటులో ఈ దారుణం జరగిపోవడంతో చుట్టపక్కల వారికి ఆమెను కాపాడుకునే అవకాశమే లేకుండా పోయింది. ఈ దారుణాన్ని చూసి వారు నిస్సహాయంగా హాహాకారాలు చేశారు. మహిళ భూజాన్ని నోట కరిచి నీళ్లల్లో వెళుతున్న మొసలి వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది (Jajpur Crocodile attack).


ఈ ఘటనతో గ్రామస్థులు వణికిపోతున్నారు. నది సమీపానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కొన్ని నెలల క్రితం దాదాపు ఇలాంటి ఘటన జరిగిందని కొందరు గ్రామస్థులు తెలిపారు. నదీ తీరం వద్ద ఉన్న ఓ గొర్రెను మొసలి నీళ్లల్లోకి లాక్కెళ్లిపోయిందని అన్నారు (Kharasrota river Incident).

ఈ ఉదంతంపై అటవీ శాఖ అధికారులు కూడా స్పందించారు. నదీ తీరం వద్దకు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరించారు. మొసలి సంచారం ఉన్నట్టు అనుమానాలున్న ప్రాంతాల్లో గస్తీ పెంచామని కూడా చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇవీ చదవండి:

నువ్వు ఇండియాకు తిరిగెళతావన్న నమ్మకం మాకు లేదు.. యువకుడికి షాకిచ్చిన అమెరికా

వీళ్లసలు మనుషులేనా.. అర్ధరాత్రి రైల్లో ఈ మహిళలు ఎలా రెచ్చిపోయారో చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Oct 07 , 2025 | 02:49 PM