Share News

CP Radhakrishnan: మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న సీపీ రాధాకృష్ణన్

ABN , Publish Date - Sep 11 , 2025 | 03:16 PM

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్.. మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్‌‌గా ఉన్న ఆచార్య దేవవ్రత్‌... మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.

CP Radhakrishnan: మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న సీపీ రాధాకృష్ణన్
CP Radhakrishnan

ఇంటర్నెట్ డెస్క్: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తాజాగా మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రస్తుత గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు రేపు (శుక్రవారం) ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (CP Radhakrishnan).

ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలోకి దిగిన సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలవగా రాధాకృష్ణన్‌కు అనుకూలంగా 452 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 781 ఎంపీల్లో 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అనంతరం మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి సీపీ రాధాకృష్ణన్ తాజాగా తప్పుకున్నారు. దీంతో, మహా గవర్నర్ బాధ్యతలను రాష్ట్రపతి ముర్ము ఆచార్య దేవవ్రత్‌కు బదిలీ చేశారు.


ఇక సీనియర్ నేత దేవవ్రత్ ఆగస్టు 2015 నుంచి జులై 2019 వరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. జులై 2019 నుంచి గుజరాత్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రెండేళ్లలో 300కు పైగా సింహాల మృతి.. కారణాలు ఏంటో తెలిస్తే..

కనీసం నాకు విషమైనా ఇప్పించండి.. కోర్టులో కన్నడ నటుడు దర్శన్ కామెంట్

For More National News and Telugu News

Updated Date - Sep 11 , 2025 | 04:12 PM