Lion deaths: రెండేళ్లలో 300కు పైగా సింహాల మృతి.. కారణాలు ఏంటో తెలిస్తే..
ABN , Publish Date - Sep 11 , 2025 | 10:01 AM
గుజరాత్‌లోని గత రెండేళ్లలో ఏకంగా 307 సింహాలు మృత్యువాత పడ్డాయి. ఆగస్టు 1, 2023 నుంచి జూలై 31, 2025 మధ్య నమోదైన 307 సింహాలు మరణించినట్టు గణాంకాలు వెల్లడయ్యాయి. అయితే వాటిల్లో కేవలం 16 శాతం మాత్రమే వృద్ధాప్యం వంటి సహజ కారణాలతో మరణించాయి.
గుజరాత్‌లోని గత రెండేళ్లలో ఏకంగా 307 సింహాలు మృత్యువాత పడ్డాయి. ఆగస్టు 1, 2023 నుంచి జూలై 31, 2025 మధ్య 307 సింహాలు మరణించినట్టు గణాంకాలు వెల్లడయ్యాయి. అయితే వాటిల్లో కేవలం 16 శాతం మాత్రమే వృద్ధాప్యం వంటి సహజ కారణాలతో మరణించాయి. మిగతా 70 శాతం సింహాలు అనారోగ్యం, తోటి జంతువులతో పోరాటాల కారణంగా చనిపోయాయి. ఈ మేరకు బుధవారం గుజరాత్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం డేటాను ప్రవేశపెట్టింది (Gujarat lion deaths).
చనిపోయిన 307 సింహాల్లో 50 సింహాలు సహజ కారణాల వల్ల, 141 అనారోగ్యంతో, 74 అంతర్గత పోరు వల్ల మరణించినట్టు సదరు డేటా వెల్లడించింది (Asiatic lions). మరో 39 సింహాలు ప్రమాదాలలో మరణించాయి. రెండు సింహాలు రోడ్డు ప్రమాదాలలో, ఐదు సింహాలు రైళ్లు ఢీకొనడంలో, 20 సింహాలు బావులలో పడిపోవడంతో, మరో మూడు సింహాలు విద్యుదాఘాతంతో మరణించాయి (Lion mortality 2025).
కొన్ని సింహాలు కనైన్ డిస్టెంపర్ వైరస్ కారణంగా చనిపోయినట్టు నిపుణులు భావిస్తున్నారు (Gir forest deaths). ఈ వైరస్ రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. కాగా గుజరాత్‌లో సింహాల పిల్లలు జీవించే రేటు 52% ఉందని, ఇది ఆఫ్రికాలో కంటే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్
కనీసం నాకు విషమైనా ఇప్పించండి.. కోర్టులో కన్నడ నటుడు దర్శన్ కామెంట్
For More National News and Telugu News