Share News

Darshan - Renukaswamy Case: కనీసం నాకు విషమైనా ఇప్పించండి.. కోర్టులో కన్నడ నటుడు దర్శన్ కామెంట్

ABN , Publish Date - Sep 09 , 2025 | 03:57 PM

తనను కసీనం సెల్ బయటకు కూడా వెళ్లనివ్వట్లేదని కన్నడ నటుడు దర్శన్ కోర్టు విచారణ సందర్భంగా ఆక్రోశం వెళ్లగక్కారు. కనీసం విషం అయినా ఇవ్వాలని కామెంట్ చేశారు. ఈ క్రమంలో కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.

Darshan - Renukaswamy Case: కనీసం నాకు విషమైనా ఇప్పించండి.. కోర్టులో కన్నడ నటుడు దర్శన్ కామెంట్
Kannada actor Darshan

ఇంటర్నెట్ డెస్క్: రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ తనకు విషం ఇవ్వాలని జడ్జి ముందు కామెంట్ చేశారు. తనను సెల్ బయటకు అనుమతించట్లేదని, ఒంటికి ఎండ తగిలి చాలా రోజులైందని చెప్పుకొచ్చాడు. చేతులకు ఫంగస్ వచ్చిందని అన్నాడు (Kannada actor Darshan Court Hearing).

సిటీ సివిల్స్ అండ్ సెషన్స్ కోర్టులో విచారణకు దర్శన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. తనను కనీసం సెల్ బయటకు వెళ్లనివ్వట్లేదని, తనకు ఎండ తగిలి చాలా రోజులైపోయిందని కామెంట్ చేశాడు. తన దుస్తుల నుంచి దుర్వాసన వస్తోందని, జైల్లో మరిన్ని ఇబ్బందుల పాలయ్యే ముప్పు ఉందని అన్నాడు. తనకు కనీసం విషమైనా ఇప్పించండంటూ జడ్జి ముందు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, కోర్టు విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది (Renukaswamy Murder Case).

ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు గతంలో దర్శన్‌కు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టు ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది (Actor Bail Denied).


బెయిల్ మంజూరు అయితే అతడు కేసు విచారణను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. చట్టానికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించింది. దర్శన్‌కు ఎలాంటి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు స్పష్టం చేసింది. ఫైవ్‌స్టార్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్టు తమ దృష్టికి వస్తే జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించింది.

దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అత్యంత దారుణంగా కొట్టినట్టు విచారణలో గుర్తించారు.


ఇవి కూడా చదవండి

భారత ఐటీ రంగంలో ఆందోళన.. అమెరికాతో చర్చలు జరుపుతున్నామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

మహిళా అధికారులంటే నాకెంతో గౌరవం: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్

For More National News and Telugu News

Updated Date - Sep 09 , 2025 | 04:19 PM