Maoist Ceasefire Controversy: సాయుధ పోరాట విరమణపై మావోలు సంచలన లేఖ..
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:04 PM
కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తమకు సంబంధం లేదని మావోయిస్టులు మరోసారి సంచలన ప్రకటన చేశారు. దీంతో సాయుధ పోరాట విరమణపై వివాదం నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన సాయుధ పోరాట విరమణ (Maoist Ceasefire Announcement) ప్రకటన తన వ్యక్తిగతమని మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తమకు సంబంధం లేదని వెల్లడించారు. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చ్ నుంచి తాము ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్థరహితమని అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకుని చేసుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయుధాలు వదిలి పెడుతామని ఏకపక్షంగా అభయ్ చేసిన ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని తెలిపారు. పార్టీలో ఎలాంటి చర్చలు జరపకుండా.. సాయుధ పోరాట విరమణ ప్రకటన చెయ్యడం తీవ్రమైన చర్య అంటూ మావోయిస్టులు షాకింగ్ ప్రకటన చేశారు.
Also Read:
ప్లేటులో రెండు పానీపూరీలు తగ్గాయని మహిళ ఆగ్రహం.. చివరకు ఏం చేసిందో చూడండి..
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్‌రెడ్డి
For More Latest News