Share News

Kerala Indias First Fully Digitally Literate State : పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ

ABN , Publish Date - Aug 21 , 2025 | 09:11 PM

భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ అవతరించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ సెంట్రల్ స్టేడియంలో ఈ మేరకు ప్రకటించారు.

Kerala Indias First Fully Digitally Literate State : పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ
Kerala Indias first fully digitally literate state

తిరువనంతపురం (కేరళ), ఆగస్టు 21 : భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ అవతరించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ (గురువారం) సెంట్రల్ స్టేడియంలో ఈ మేరకు ప్రకటించారు. 'ఇది నిజంగా కేరళకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మలయాళీకి గర్వకారణమైన క్షణం. ఈ రోజు, మన రాష్ట్రం ఒక మైలురాయిని సాధించింది. కేరళ భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ రాష్ట్రంగా అవతరించింది. అంకితభావం వల్ల ఈ విజయం సాధ్యమైంది. మన యువతకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.' అని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు.

'1991లో దేశంలో మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా కేరళ నిలిచినట్లే, నేడు మనం మరొక మైలురాయిని చేరుకోవడం ద్వారా చరిత్రను పునరావృతం చేసాం. రెండు విజయాలు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ నాయకత్వంలో వచ్చాయి. ఇది పురోగతి కోసం సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి అవసరమైన నిబద్ధత, దృఢ సంకల్పాన్ని నొక్కి చెబుతుంది' అని కేరళ ముఖ్యమంత్రి అన్నారు.

Kerala-Fist-State-in-Digita.jpg


'ఈ విజయం పుల్లంపురలో ప్రారంభమైంది. కేరళలో మొట్టమొదటి పూర్తిగా డిజిటల్ అక్షరాస్యత కలిగిన మొదటి పంచాయతీ ఇది అని సీఎం చెప్పారు. సవాళ్లను అధిగమించి, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రతినిధులు, విద్యార్థులు, వృద్ధులు, గృహిణులు సహా సాధారణ పౌరులు కూడా డిజిటల్‌గా సాధికారత పొందేలా తోడ్పాటునిచ్చారు. ఒకప్పుడు కంప్యూటర్లు లేదా స్మార్ట్‌ఫోన్‌లను తక్కువగా ఉపయోగించే వారు నేడు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లిస్తున్నారు. సేవలను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటున్నారు.' ఈ విజయం 'దేశమంతటికీ ఒక నమూనా' అని కూడా కేరళ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

"జాతీయ, ఇంకా ప్రపంచ గణాంకాలతో పోల్చినప్పుడు కేరళ సాధించిన విజయం గొప్పది. భారతదేశంలో కేవలం 38% కుటుంబాలు మాత్రమే డిజిటల్ అక్షరాస్యత కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేరళ విజయం మనకు ఒక మైలురాయి మాత్రమే కాదు, మొత్తం దేశానికే ఒక రోల్ మోడల్.' అని పినరయి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 09:23 PM