Share News

CM Stalin: నేను, నాన్న క్రికెట్‌ లవర్స్‌...

ABN , Publish Date - Dec 26 , 2025 | 01:03 PM

నేను, నాన్న కరుణానిధి క్రికెట్‌ లవర్స్‌ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... కరుణానిధి క్రికెట్‌ పోటీలను స్టేడియంకు వెళ్ళి ఆసక్తిగా తిలకించేవారని గుర్తు చేశారు. అలాగే... క్రికెట్‌లో ధోనీ కెప్టెన్సీ అంటే తనకెంతో ఇష్టమని ముఖ్యమంత్రి అన్నారు.

CM Stalin: నేను, నాన్న క్రికెట్‌ లవర్స్‌...

- ముఖ్యమంత్రి స్టాలిన్‌

చెన్నై: నేను, మా నాన్న క్రికెట్‌ లవర్స్‌మని, క్రికెట్‌లో తానొక ఆఫ్‌ స్పిన్నర్‌నని, తన తండ్రి కరుణానిధి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఆయనకు బౌలింగ్‌ చేశానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) తెలిపారు. ఇటీవల ‘వైబ్‌ విత్‌ ఎంకేఎస్‌’ పేరుతో యువ క్రీడాకారులతో ఏర్పాటైన చర్చా వేదికలో స్టాలిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలకు సంబంధించినంతవరకూ తనకు, తన తండ్రి కరుణానిధికి క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.


nani1.jpg

కరుణానిధి క్రికెట్‌ పోటీలను స్టేడియంకు వెళ్ళి ఆసక్తిగా తిలకించేవారని గుర్తు చేశారు. ఆ తర్వాత యువ క్రీడాకారులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ చర్చాకార్యక్రమానికి సంబంధించిన వీడియో స్టాలిన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తాను 14 యేళ్ల ప్రాయంలోనే రాజకీయాల్లోకి వచ్చానని, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నో ఒత్తిడులకు, ఉద్రిక్తతలకు గురయ్యానని, టెన్షన్‌ అధికమైతే పుస్తకం చదువతానని, లేకుంటే నచ్చిన పాట వింటానని సీఎం తెలిపారు.


ధోనీ కెప్టెన్సీ ఇష్టం..

క్రికెట్‌లో ధోనీ కెప్టెన్సీ అంటే తనకెంతో ఇష్టమని, ఆటలో ధోనీ ఎంత ఒత్తిడి ఎదురైనా విసుగు చెందకుండా చివరి బంతి వరకూ పోరాడ్డం చూసి ఆశ్చర్యపోతుంటానని స్టాలిన్‌ అన్నారు. వయసు పెరుగుతున్నా క్రికెట్‌పై ఆయనకింకా మోజు తీరలేదని, ఇంకా ఆడాలని ఆసక్తికనబరుస్తున్నారని పేర్కొన్నారు.ధోనీతో తనను పోల్చుకోనని, రాజకీయాల్లో టెన్షన్‌కు గురికాకుండా ఉండాలని మాత్రమే కోరుకుంటానని చెప్పారు. ఆటలో గెలుపోటములు సహజమేనన్న భావనతో యువక్రీడాకారులు ముందుకు సాగాలని, అదే వారికి తానిచ్చే సలహా అని స్టాలిన్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహానగరంలో మత్తు మూకలు!

ప్రతి దరఖాస్తుకూ జవాబుదారీ

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2025 | 01:03 PM