Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:35 AM
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో నేడు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతం పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. అయితే, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది (Sukma Maoist encounter).
నేడు ఉదయం నుంచే ఆ ప్రాంతంలో అప్పుడప్పుడూ కాల్పులు శబ్దాలు వినిపించాయి. దీంతో, అధికారులు హైఅలర్ట్‌లో ఉన్నారు. ఇక తాజా ఎన్‌కౌంటర్ తరువాత పోలీసులు ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ నక్సల్స్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో తొలుత భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇంతలో నక్సలైట్స్ కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో కొందరు మావోయిస్టులు మరణించినా గాయపడ్డ వారు అడవిలోకి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, అదనపు భద్రతా దళాలు కూడా రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి ప్రకటన ఇంకా చేయాల్సి ఉంది. ఏరివేత చర్యలు మొత్తం పూర్తయ్యాక భద్రతా దళాలు.. మృతుల వివరాలు వెల్లడిస్తాయని సమాచారం. ప్రస్తుతం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. జిల్లా యంత్రాంగా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.
Also Read:
శీతాకాలంలో పచ్చి బఠానీలు తినొచ్చా?
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి.