Chhattisgarh firing: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు ముగ్గురు పోలీసులు మృతి
ABN , First Publish Date - 2023-02-26T03:02:38+05:30 IST
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమ జిల్లాలో శనివారం మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు.
రాయపూర్, ఫిబ్రవరి 25: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమ జిల్లాలో శనివారం మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. రాష్ట్ర రాజధాని రాయపూర్‌కు 400 కి.మీ. దూరంలోని జగర్‌గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్‌జీ)కి చెందిన ఓ జట్టు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మావోయిస్టులతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీనిలో ఏఎ్‌సఐ రమురమ్ నాగ్ (36), కానిస్టేబుళ్లు కుంజం జోగా(33), వంజం భీమా(31) మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను జగర్‌గుండకు చేర్చాయి. ఆ ప్రాంతాన్ని సాయుధ బలగాలు జల్లెడపడుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో సుమారు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీస్ అధికారులు చెపుతున్నారు. మావోయిస్టుల మృతదేహాలను వారి సహచరులు లోతట్టు ప్రాంతాలకు తరలించారని అంటున్నారు. ఈనెల 20న రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో మావోయిస్టుల దాడిలో ఇద్దరు పోలీసులు చనిపోయారు.