Odisha : నీటి కోసం చిన్నారుల అష్టకష్టాలు

ABN , First Publish Date - 2023-03-07T16:38:04+05:30 IST

ఒడిశా (Odisha)లోని నవరంగ్‌పూర్, ఉమర్కోటే బ్లాక్‌లో త్రాగు నీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రాంపర

Odisha : నీటి కోసం చిన్నారుల అష్టకష్టాలు
Rampara Village in Odisha

భువనేశ్వర్ (ఒడిశా) : ఒడిశా (Odisha)లోని నవరంగ్‌పూర్, ఉమర్కోటే బ్లాక్‌లో త్రాగు నీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రాంపర (Rampara) గ్రామంలోని ప్రభుత్వ నూతన ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు సురక్షితమైన నీటి కోసం సుమారు 500 మీటర్లు నడవవలసి వస్తోంది. వేసవి కాలం సమీపిస్తుండటంతో వీరి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

రాంపర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులు సురక్షితమైన నీటి (Safe Drinking Water) కోసం 500 మీటర్లకుపైగా నడవవలసి వస్తోంది. వీరి అవసరానికి తగిన స్థాయిలో నీరు అందుబాటులో ఉండటంలేదు. కనీసం ఓ బోరు బావి అయినా అందుబాటులో లేదు. ఇక్కడ 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్నాయి. మొత్తం మీద ఈ పాఠశాలలో 179 మంది చదువుతున్నారు.

రాష్ట్రంలోని పాఠశాలలన్నిటికీ త్రాగునీరు సరఫరా అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాంపర గ్రామస్థులు చెప్పారు. అయితే తమ గ్రామంలోని పాఠశాలలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Congress Vs BJP : స్వదేశాన్ని అవమానిస్తున్న రాహుల్ గాంధీ : రవిశంకర్ ప్రసాద్

Miss Asia: ఆడవాళ్ళ బాడీ ఫిట్‌గా ఉన్నా తప్పే.. మగవాళ్ళలా ఉన్నారనే కామెంట్స్ తప్పవు..!

Updated Date - 2023-03-07T16:38:04+05:30 IST