రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-11-15T01:09:25+05:30 IST

రాష్ట్రంలో నైపుణ్యం గల క్రీడా కారులను ప్రోత్సహంచి క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా అన్నారు. కొండపల్లి ఖిల్లాపై పర్యాటకశాఖ ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
పతకాలు సాధించిన క్రీడాకారులతో మంత్రులు, ఎమ్మెల్సీలు, శాప్‌ ప్రతినిధులు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం), నవంబరు 14: రాష్ట్రంలో నైపుణ్యం గల క్రీడా కారులను ప్రోత్సహంచి క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా అన్నారు. కొండపల్లి ఖిల్లాపై పర్యాటకశాఖ ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఇటీవల గుజరాత్‌ రాష్ట్రం ఆహ్మదాబాద్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడా పోటీలతో మన రాష్ట్రానికి చెందిన 16 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. కోటి 23లక్షల నగదు, మెడల్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారి ప్రతిభను గుర్తించనున్నట్టు తెలిపారు. డిసెంబరు 21న జగన్‌ జన్మదినం సందర్భంగా 50లక్షల విలువైన బహుమతులతో క్రీడా సంబరాలు జరపనున్నట్టు తెలిపారు. శాప్‌ చైర్మెన్‌ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, పురావస్తుశాఖ ఎండీ వాణీమోహన్‌ మాట్లాడుతూ, రాష్ట్రం లో 184 పర్యాటక ప్రాంతాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. అనంతరం నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ వంగాగీత, ఎమ్మల్యే ఉండవల్లి శ్రీదేవి, చింతా అనురాధ, తెలుగు అధికార భాష అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, ఎండీ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, విజయవాడ మేయ ర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమెల్సీ పోతుల సునీత, కల్పలత, మహిళా కమిషన్‌ చైర్మెన్‌ వాసిరెడ్డి పద్మ, టూరిజం ఎండీ కన్నబాబు, డిప్యూటీ మేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T01:09:27+05:30 IST