Share News

Dogs: పెంపుడు శునకాలకు మైక్రో చిప్‌..

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:29 PM

రోజురోజుకు శునకాల బెడద అధికమవుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పెంపుడు శునకాలకు ‘మైక్రో చిప్‌’ అమర్చాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

Dogs: పెంపుడు శునకాలకు మైక్రో చిప్‌..

- అమర్చకుంటే రూ.3,000 జరిమానా

చెన్నై: రోజురోజుకు శునకాల బెడద అధికమవుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (Greater Chennai Corporation) అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పెంపుడు శునకాలకు ‘మైక్రో చిప్‌’ అమర్చాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై పెంపుడు శునకాలకు మైక్రోచిప్‌ అమర్చని యజమానులకు రూ.3వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా వీధి శునకాల బెడద అధికమవుతోంది.


వీధి శునకాలు పాదచారులపై దాడి చేసే ఘటనలు ప్రతిరోజూ సంభవిస్తున్నాయి. దీనికి తోడు పెంపుడు శునకాలు కూడా ప్రజలపై దాడిచేస్తున్న ఘటనలున్నాయి. తాము పెంచుకునే శునకాల వయసు పైబడడమో, అనారోగ్యం పాలవడమో జరిగితే ఆయా యజమానులు వాటిని రోడ్లపై వదిలేస్తున్నారు. అప్పటి వరకూ యజమానుల ఆలనాపాలనా పొందిన శునకాలు.. ఒక్కసారిగా రోడ్డున పడడంతో అవి భయభ్రాంతులకు గురై కనిపించినవారిపై దాడి చేస్తున్నాయి. ఈ వ్యవహరంపై సత్వర చర్యలు చేపట్టాలని నిర్ణయించిన జీసీసీ పెంపుడు శునకాలకు మైక్రో చిప్‌ అమర్చాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు అక్టోబరు నుంచి అమలుకు రానున్నాయి.

nani5.jpg


12,500 పెంపుడు శునకాలు...

జీసీసీ పరిధిలో 12,500 పెంపుడు శునకాలకు మాత్రమే లైసెన్స్‌ పొందగా, లైసెన్స్‌ పొందని పెంపుడు శునకాల వివరాలు సేకరిస్తున్నట్టు జీసీసీ అధికారులు తెలిపారు. పెంపుడు శునకాలకు మైక్రో చిప్‌ అమర్చాలనిజనవరిలో నిర్వహించిన జీసీసీ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించారు. ఆ ప్రకారం, శునకాలకు మైక్రో చిప్‌ అమర్చేందుకు మైక్రో చిప్‌ కొనుగోలు, అమర్చడంపై ప్రభుత్వ, ప్రైవేటు వెటర్నరీ ఆరోగ్య కేంద్రాలకు త్వరలో విధివిధానాలు వెలువరించనున్నట్లు తెలిపిన జీసీసీ అధికారులు, పెంపుడు శునకాలను బయటకు తీసుకెళ్లే సమయంలో వాటి మూతిని తప్పక మూసివేసేలా పరికరం ఏర్పాటుచేయాలని యజమానులకు సూచించారు. అలాగే, నగరంలోని 1.80 లక్షల వీధి శునకాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు ర్యాబిస్‌ నిరోధక టీకాలు వేయాలని నిర్ణయించామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

‘గే’ యాప్‌ ‘గ్రైండర్‌’ ద్వారా డ్రగ్స్‌ విక్రయం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2025 | 01:29 PM