Metro Trains: 15 నుంచి మెట్రోరైలు వేళల్లో మార్పులు
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:28 PM
స్థానిక వడపళని రైల్వేస్టేషన్ పైభాగంలో రెండో దశ నిర్మాణపనుల కారణంగా గ్రీన్ లైన్ మార్గంలో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు జరిగాయి. కోయంబేడు నుంచి అశోక్ నగర్ వరకు మెట్రోరైలు సేవల్లో ఈ నెల 15 నుంచి 19వ తేది వరకు తాత్కాలికంగా మార్పులు చేశారు.
చెన్నై: స్థానిక వడపళని రైల్వేస్టేషన్(Nadapalani Railway Station) పైభాగంలో రెండో దశ నిర్మాణపనుల కారణంగా గ్రీన్ లైన్ మార్గంలో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు జరిగాయి. కోయంబేడు నుంచి అశోక్ నగర్ వరకు మెట్రోరైలు సేవల్లో ఈ నెల 15 నుంచి 19వ తేది వరకు తాత్కాలికంగా మార్పులు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు సెయింట్ థామస్ మౌంట్-అశోక్ నగర్ మెట్రో రైల్వేస్టేషన్ వరకు 14 నిమిషాలు, విమానాశ్రయం నుంచి అశోక్ నగర్ 14 నిమిషాల వ్యవధి, సెంట్రల్-కోయంబేడు మధ్య 7 నిమిషాలకు ఒక రైలు నడుపనున్నారు.

ఆ సమయంలో కోయంబేడు(Koyambedu) నుంచి అశోక్ నగర్ వరకు మెట్రో రైలు సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఆ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్ధం కోయంబేడు, అశోక్ నగర్ వరకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు 10 నిమిషాలకు ప్రత్యేక లింక్ బస్సు నడుపనున్నారు. ఉదయం 6 గంటల నుంచి యధావిధిగా మెట్రోరైలు సేవలు కొనసాగుతాయి. వింకోనగర్-సెంట్రల్-విమానాశ్రయం మార్గంలో ఎలాంటి మార్పులు లేవని చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News