Amit Shah: నక్సల్స్‌తో చర్చల్లేవ్.. లొంగిపోండి.. అమిత్‌షా హెచ్చరిక
ABN , Publish Date - Oct 04 , 2025 | 06:02 PM
బస్తర్ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకైనా మావోయిస్టులు పాల్పడితే భద్రతా బలగాలు గట్టి జవాబిస్తాయని అమిత్‌షా హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 'రెడ్ టెర్రర్'కు ముగింపు పలికేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
జగదల్పూర్: నక్సల్స్‌తో కేంద్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) మరోసారి స్పష్టం చేశారు. లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్ (Chattisgarh) లోని జగదల్పూర్‌లో శనివారం నాడు జరిగిన ర్యాలీలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. నక్సల్స్ ఆయుధాలు వీడి లొంగిపోవాలని, కేంద్రం ప్రకటించిన పునరావాస పాలసీని అందిపుచ్చుకోవాలని సూచించారు.
బస్తర్ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకైనా మావోయిస్టులు పాల్పడితే భద్రతా బలగాలు గట్టి జవాబిస్తాయని ఆయన హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 'రెడ్ టెర్రర్'కు ముగింపు పలికేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
'కొందరు వ్యక్తులు వాళ్లతో (నక్సల్స్) చర్చలు జరపాలంటూ మాట్లాడుతున్నారు. మళ్లీ చాలా స్పష్టంగా చెబుతున్నా. ఇటు ఛత్తీస్‌గఢ్‌లోనూ, అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న మా రెండు ప్రభుత్వాలు బస్తర్‌తోపాటు నక్సల్ ప్రభావిత ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం' అని అమిత్‌షా అన్నారు. తాము ఎంతో ఆకర్షణీయమైన లొంగుబాటు పాలసీని తెచ్చామని, నక్సల్స్ ఆయుధాలు వీడి లొంగిపోవాలని కోరారు. అలా కాకుండా బస్తర్ ప్రాంతంలో శాంతికి భగం కలిగిస్తే సాయుధ బలగాలు, సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసులు తీవ్రంగా ప్రతిఘటిస్తాయని హెచ్చరించారు.
బస్తర్ ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అమిత్‌షా ప్రశంసించారు. గత పదేళ్లలో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రూ.4 లక్షల కోట్లకు పైగా కేంద్రం కేటాయించిందని, రాష్ట్రంలోని గిరిజనుల కోసం పలు పథకాలను బీజేపీ ప్రారంభించిందని చెప్పారు.
స్వదేశీకి పట్టం కడితే..
దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు 'స్వదేశీ'కి కట్టుబడితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలుస్తుందని, దీనిని ఎవరూ అడ్డుకోలేరని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇటీవల జీఎస్‌టీ రేట్లు తగ్గించడం ద్వారా ఎంతో ఉపశమనం కలిగించారని, స్వదేశీ సంస్కృతికి మనమంతా కట్టుబడితే దేశ ఆర్థిక వ్యవస్థ అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సోషల్ మీడియా ట్రోల్స్‌తో జన్‌నాయక్‌లు కాలేరు.. రాహుల్‌పై మోదీ విసుర్లు
ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన ఈసీ.. 12 రాజకీయ పార్టీలతో భేటీ
Read Latest Telangana News and National News