Central Government Railway Bonus: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. దసరా, దీపావళి బోనస్ ప్రకటించిన కేంద్రం
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:39 PM
దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగుల కోసం కేంద్రం 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగులకు కేంద్రం 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. దీంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,866 కోట్లు కేటాయించింది.
నాన్‌గెజిటెడ్ గ్రూప్ C, గ్రూప్ D (లెవెల్ 1 స్టాఫ్) ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించనుంది. అలాగే, రైల్వే ప్రొడక్షన్ యూనిట్లు, రైల్వే వర్క్‌షాపులు, ఇతర సహాయ విభాగాలలో పనిచేసే ఉద్యోగులకూ ఈ బోనస్ అందనుంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారీ కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల కోసం పండుగ బోనస్‌ను ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ(బుధవారం) జరిగిన కేంద్ర కేబినెట్ మీట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సముద్ర రంగం అభివృద్ధికి రూ.69,725 కోట్లు
ఇదిలా ఉంటే.. సాహెబ్ గంజ్- బెట్టయ్య NH 139 నాలుగు లైన్ల రహదారి 79 కి.మీ. అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్లలో పూర్తి కానున్న ఈ నిర్మాణానికి కేంద్రం రూ.3,822 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే, భక్తియార్ పూర్ - రాజ్ గిర్- తలయ రైల్వే లైన్ డబ్లింగ్‌కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 104 కి.మీ. మేర రైల్వే లైన్ డబ్లింగ్ కోసం కేంద్రం రూ.2,192 కోట్లు ఖర్చుపెట్టనుంది.
ఈ నిర్మాణం ద్వారా బిహార్- జార్ఖండ్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది. షిప్పింగ్ మారిటైమ్ అభివృద్ధి సంస్కరణల కోసం కేంద్రం రూ.69,725 కోట్లు కేటాయించనుంది. షిప్పుల తయారీ, షిప్పింగ్ రంగ అభివృద్ధి కోసం కేంద్ర కేబినెట్ నిధులు కేటాయించింది.
NH-139W నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అంతేకాకుండా, బిహార్‌లో బఖ్తి అర్పూర్–రాజ్‌గిర్–తిలైయా రైల్వే లైన్ డబ్లింగ్‌కు రూ.2,192 కోట్ల వ్యయంతో కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, బిహార్‌లో సహేబ్‌గంజ్-అరేరాజ్-బెట్టియా జాతీయ రహదారి (NH-139W) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.3,822.31 కోట్ల వ్యయంతో 79 కి.మీ. జాతీయ రహదారి నిర్మించనుంది.
Also Read:
నవరాత్రి ఉత్సవాలు.. ఈ దేవాలయాలను సందర్శించడం మర్చిపోకండి
లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్
For More Latest News