IPS Dowry Harrasment Case: ఐపీఎస్ ఆఫీసర్‌పై భార్య ఫిర్యాదు.. నోయిడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:53 AM
కర్ణాటక కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ శివాన్షూ రాజ్‌పుత్‌పై ఆయన భార్య డా.కృతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివాన్షూ, ఆయన కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం తనను వేధించారని అరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక కేడర్‌కు చెందిన 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివాన్షూ రాజ్‌పుత్‌పై నోయిడా పోలీస్ స్టేషన్‌లో తాజాగా కేసు నమోదైంది. శివాన్షూ భార్య డా. కృతీ సింగ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తన భర్త రాజ్‌పుత్, అతడి కుటుంబసభ్యులు తనను అదనపు కట్నం తెమ్మని వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు. భర్తతో పాటు ఆయన తల్లి, తండ్రి, ఆయన సోదరుడు, సోదరిలపై కేసు పెట్టారు (Karnataka IPS officer Domestic Violence case) .
తమది ప్రేమ వివాహమే అయినా కూడా తాను నిరంతర శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్టు డా.కృతి తెలిపారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో తమ వివాహం జరిగిందని, ఇందుకు కోసం ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. తన భర్త పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కూడా ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి