Share News

Pakistan: పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్.. సంచలన విషయం బయటపెట్టిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ

ABN , Publish Date - May 25 , 2025 | 07:05 PM

మార్చి నెలలో పాకిస్థాన్‌కు చెందిన బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బలూచిస్థాన్ సాధన కోసం ఎప్పట్నుంచో పోరాటం చేస్తున్న బీఎల్ఏ.. పాక్ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది.

Pakistan: పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్.. సంచలన విషయం బయటపెట్టిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ
BLA releases Stunning Video

మార్చి నెలలో పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన బలూచిస్థాన్ (Balochistan) ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ (Jaffar Express Hijack) చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బలూచిస్థాన్ సాధన కోసం ఎప్పట్నుంచో పోరాటం చేస్తున్న బీఎల్ఏ.. పాక్ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 11వ తేదీన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి 214 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ అప్పట్లో ప్రకటించింది. అయితే బీఎల్‌ఏ ప్రకటనను పాక్ ఖండించింది.


ఆ హైజాక్ గురించి పాకిస్థాన్ స్పందిస్తూ.. ఆ ఘటనలో బీఎల్‌ఏ సైనికులు చాలా మంది దారుణంగా హతమయ్యారని, వారికి భారీ ప్రాణనష్టం సంభవించిందని పేర్కొంది. హైజాక్ సమయంలో తిరుగుబాటుదారులు సాధారణ ప్రయాణికులపై దాడికి తెగబడ్డారని, రక్తపాతం సృష్టించారని పేర్కొంది. 30 గంటల్లోనే పాక్ భద్రతా దళాలు 33 మంది తిరుగుబాటుదారులను హతమార్చాయని పాకిస్తాన్ పేర్కొంది. అయితే పాక్ ప్రభుత్వం ప్రకటన పూర్తిగా అవాస్తవమని బీఎల్‌ఏ తాజాగా విడుదల చేసిన వీడియో ధ్రువీకరిస్తోంది.


ఆ వీడియో ప్రకారం బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ సైనికులు సాధారణ ప్రయాణికులు, మహిళలు, పిల్లలను రైలు నుంచి సురక్షితంగా కిందకు దించారు. ఆ హైజాక్ ఎలా జరిగిందో ఆ వీడియోలో కనబడుతోంది. తుపాకీని ఆపడానికి తుపాకీ అవసరం అని ఆ వీడియోలో పేర్కొన్నారు. బలూచిస్థాన్ ఓడిపోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. రైలు హైజాక్‌కు ముందు పట్టాలను పేల్చడం కూడా స్పష్టంగా కనబడుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను పాకిస్తాన్ సైన్యం తప్పుదారి పట్టిస్తోందని బీఎల్‌ఏ ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

Gold Rates on May 25: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 07:27 PM