BJP Sharath Kumar: నటుడు శరత్‌కుమార్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:19 PM
తన సభలకు కూడా జనం భారీగా హాజరయ్యేవారని బీజేపీ నేత శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ప్రచారానికి లక్షలాది మంది తరలిరావడంపై పలు పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
నా సభలకు కూడా భారీగా జనం..
బీజేపీ నేత శరత్‌కుమార్
చెన్నై: తన సభలకు కూడా జనం భారీగా హాజరయ్యేవారని బీజేపీ నేత శరత్‌కుమార్(Sharath Kumar) వ్యాఖ్యానించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ప్రచారానికి లక్షలాది మంది తరలిరావడంపై పలు పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఈ వ్యవహారంపై శరత్‌కుమార్ స్పందిస్తూ... 1996లో ‘నాట్టామై’, ‘సూర్యవంశం’ తదితర విజయవంతమైన చిత్రాల అనంతరం తాను రాజకీయాల్లోకి వచ్చానని, పదవీవిరమణ అనంతరం రాజకీయాల్లోకి రాలేదన్నారు.

మదురై(Madhurai)లో తాను నిర్వహించిన సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని, అప్పటి వీడియో దృశ్యాలు కావాలంటే పరిశీలించవచ్చన్నారు. ఏ పార్టీ సభకైనా ప్రజలు పెద్దసంఖ్యలో వస్తారని, విజయ్‌కు సిద్ధాంతం, లక్ష్యం లేవని, ప్రతిపక్ష రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని శరత్‌కుమార్ విమర్శించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Read Latest Telangana News and National News