Share News

Annamalai: డీలిమిటేషన్ రగడ.. స్టాలిన్ అఖిలపక్ష సమవేశానికి బీజేపీ దూరం

ABN , Publish Date - Mar 01 , 2025 | 09:55 PM

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలుకాకుండానే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏవేవో ఊహించుకుని అనవసరవమైన భయాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

Annamalai: డీలిమిటేషన్ రగడ.. స్టాలిన్ అఖిలపక్ష సమవేశానికి బీజేపీ దూరం

చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తమిళనాడుపై ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ పాల్గొనడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై (K Annamalai) తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలుకాకుండానే ముఖ్యమంత్రి ఏవేవో ఊహించుకుని అనవసరమైన భయాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం ఉద్దేశం కూడా చెప్పిన అబద్ధాలే చెప్పడం, భయాలు సృష్టించేందుకేనని ఆయన అన్నారు.

Prashant Kishor: నటుడు విజయ్ పార్టీకి ఒంటరిగా ఎన్ని సీట్లు వస్తాయంటే.. పీకే జోస్యం ఇదే


''డీలిమిటేషన్ ప్రక్రియను సరైన సమయంలో డీలిమిటేషన్ కమిషన్ ప్రకటిస్తుందనే విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఒకే దేశం ఒకే ఎన్నికల విషయంలోనూ ఇలాంటి అబద్ధాలే ముఖ్యమంత్రి ప్రచారం చేశారు. అవి ఉత్తదేనని తేలింది. అయినప్పటికీ ఆయన పాఠాలు నేర్చుకోలేదు'' అని అన్నామలై వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల లోక్‌సభ స్థానాలు తగ్గిపోతాయని స్టాలిన్ చేస్తు్న్న వాదనకు ఏవైనా విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తమిళనాడు ప్రజలకు మేలు జరిగే అలాంటి డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే వాటిని బయటపెట్టాలని కోరారు. జనాభా ఆధారంగా హక్కులు ఉండాలంటూ 2023లో ఇండియా కూటమి ప్రచార స్లోగన్ ఇచ్చిందని, అయితే ఇందువల్ల జనాభా నియంత్రణ చర్యలు అమలు చేస్తు్న్న దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రధానమంత్రి మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారని అన్నామలై గుర్తుచేశారు.


కాగా, జాతీయ విద్యావిధానం పేరుతో నిర్బంధ హిందీ అమలు, నియోజకవర్గాల పునర్విభజన పేరిట లోక్‌సభ స్థానాలు తగ్గించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలకు స్టాలిన్‌ శుక్రవారంనాడు బహిరంగ లేఖ రాశారు.పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవటం తనకు అలవాటు అని. అయితే ఈసారి హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రేరేపించాల్సిన అవసరమున్నందున పార్టీ శ్రేణులందరిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2025 | 09:55 PM