Delhi CM: ఢిల్లీ సీఎంపై సస్పెన్స్‌కు రెండ్రోజుల్లో తెర
ABN , Publish Date - Feb 15 , 2025 | 07:33 PM
దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడి ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినను బీజేపీ కైవసం చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘనవిజయం సాధించి వారం రోజులైనా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సస్పెన్స్‌కు మరో 2-3 రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. కీలకమైన పార్లమెంటరీ సమావేశం అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని బీజేపీ ఎంపీ యోగేంద్ర చందోలియా శనివారంనాడు తెలిపారు.
Maha Kumbh: కుంభమేళాను పొడిగించండి.. యోగి సర్కార్‌ను కోరిన అఖిలేష్
''సీఎం ఎవరనదే దానిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. రేపు కానీ ఎల్లుండ కానీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో సీఎం పేరుపై ఒక నిర్ణయం తీసుకుంటారు. సమావేశం 24 గంటల నుంచి 36 గంటలు జరుగవచ్చు. కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయానికి 48 మంది ఎమ్మెల్యేలు కట్టుబడి ఉంటారు. రాబోయే 2, 3 రోజుల్లో సీఎం ఎవరనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది'' అని చందోలియా తెలిపారు.
దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడి ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినను బీజేపీ కైవసం చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని హవా సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది.
ఇవి కూడా చదవండి...
US Deportation Flights: భారత్‌కు మరో వలసదారుల విమానం.. ఏయే రాష్ట్రాల వారు ఉన్నారంటే..
Special Vande Bharat Train: నేటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కి ప్రత్యేక వందే భారత్ రైలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.