BJP leader: బీజేపీ నేత దారుణహత్య..
ABN , Publish Date - Aug 30 , 2025 | 09:53 AM
శివగంగ పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తున్న బీజేపీ నగర శాఖ వాణిజ్య విభాగం నాయకుడు సతీష్(51) శుక్రవారం వేకువజామున మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య జరిగిన తగాదాలో దారుణహత్యకు గురయ్యాడు. శివగంగ వారపు సంత లో సతీష్ మోటరు సైకిల్ మెకానిక్ దుకాణం నడుపుతున్నాడు.
చెన్నై: శివగంగ పోలీసు క్వార్టర్స్(Sivaganga Police Quarters)లో నివసిస్తున్న బీజేపీ నగర శాఖ వాణిజ్య విభాగం నాయకుడు సతీష్(51) శుక్రవారం వేకువజామున మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య జరిగిన తగాదాలో దారుణహత్యకు గురయ్యాడు. శివగంగ వారపు సంత లో సతీష్ మోటరు సైకిల్ మెకానిక్ దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. దుకాణాన్ని మూసి వేసి రాత్రిపూట స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండేవాడు.
ఆ ప్రకారమే గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా అదే సమయంలో డప్పులు వాయించే బృందానికి చెందిన కొందరు సతీష్ వద్దకు వచ్చి వెంట తెచ్చుకున్న మద్యం తాగారు. మత్తు అధికం కావటంతో ఇరువర్గాలకు చెందినవారు దుర్భాషలాడుకున్నారు. దీనితో డప్పులు వాయించే బృందానికి చెందిన కొందరు సతీష్ వర్గీయులపై దాడికి దిగారు.

సతీష్ స్నేహితుడు మణిభారతిపై దాడిని సతీష్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ప్రత్యర్థులు సతీష్ పై దాడి జరపటంతో ఆయన నేలపై పడ్డాడు. వెంటనే ఆయన్ను శివగంగ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే సతీష్ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. ఇక గాయపడిన మణిభారతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News