BJP: ధర్మస్థలపై అనవసర ఆరోపణలు తగవు
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:47 AM
ధర్మస్థల పుణ్యక్షేత్రంపై అనవసర ఆరోఫలు చేయడం తగదని బీజేపీ నాయకులు శుక్రవారం నగరంలో ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి నేతృత్వంలో నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా రాయల్ సర్కిల్‌లో మానహారం ఏర్పడి ధర్మస్థలపై ఆరోపణలు చేయడం మంచిది కాదని నినదించారు.
- బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ
బళ్లారి(బెంగళూరు): ధర్మస్థల పుణ్యక్షేత్రంపై అనవసర ఆరోఫలు చేయడం తగదని బీజేపీ(BJP) నాయకులు శుక్రవారం నగరంలో ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి(Gali Somashekhar Reddy) నేతృత్వంలో నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా రాయల్ సర్కిల్‌లో మానహారం ఏర్పడి ధర్మస్థలపై ఆరోపణలు చేయడం మంచిది కాదని నినదించారు. అనంతరం ర్యాలీగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఒక మతిస్థిమితం లేని వ్యక్తి, అదీ ఎవరోడబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తుల మాటల ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని సీఎంపై నిప్పులు చెరిగారు. హిందుత్వాన్ని దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు కావాలనే ధర్మస్థలపై నిందలు వేశారని అన్నారు. అనంతరం డీసీ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మోత్కర్ శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా నాయకురాలు డాక్టర్ అరుణ, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News