Share News

విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయం సరికాదు..

ABN , Publish Date - May 20 , 2025 | 01:58 PM

రాష్ట్రప్రభుత్వం.. విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని బీజేపీ, సీపీఐలు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ సందర్భంగా ఆ పార్టీల నేతలు మాట్లాడుతూ... ఇప్పటికే అన్ని రకాల పన్నుల పెంపుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మళ్లీ విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు నిర్ణయించిందని ఆ పార్టీల నేతలు అన్నారు.

 విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయం సరికాదు..

చెన్నై: విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని బీజేపీ, సీపీఐలు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ అంశంపై సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌ వేర్వేరుగా ప్రకటన విడుదల చేశారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యుత్‌ ఛార్జీలను పెంచుతుండటం వల్ల వ్యాపారులు, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రజలపై మరింత ఆర్థిక భారం పెరిగిందని నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శించారు.

ఈ వార్తను కూడా చదవండి: Doctor: విధుల నుంచి ప్రభుత్వ వైద్యుడి తొలగింపు.. రూ.40 లక్షల జరిమానా.. విషయం ఏంటంటే..


ఇప్పటికే అన్ని రకాల పన్నుల పెంపుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మళ్లీ విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు తమిళనాడు విద్యుత్‌ బోర్డు (టీఎన్‌ఈబీ) నిర్ణయించిందని, దాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అదేవిధంగా విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయం సరికాదని అద్దె ఇళ్లలో ఉండే పేదప్రజలు ఆర్థికపరంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌ తన ప్రకటన ద్వారా రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.


టీఎన్‌ఈబీ నిర్ణయం...

జూలై నుంచి విద్యుత్‌ ఛార్జీలు పెంచే అంశాన్ని విద్యుత్‌ బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గృహాలు, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు అని మూడు విభాగాల్లో సుమారు 3 కోట్లకు పైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఆ కనెక్షన్లకు తమిళనాడు విద్యుత్‌ క్రమబద్ధీకరణ కమిషన్‌ నిర్ణయించిన ఛార్జీలను వసూలు చేస్తుంటారు.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు 3 శాతం పెంచేలా విద్యుత్‌ బోర్డుకు విద్యుత్‌ క్రమబద్ధీకరణ కమిషన్‌కు సిఫారసు చేసింది. 2023 జూలైలో 2.18 శాతం విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. అలాగే, వాణిజ్య కనెక్షన్లకు 2024 జూలైలో 4.8 శాతం ఛార్జీలు పెంచారు. కమిషన్‌ సిఫారసులపై సీఎందే తుది నిర్ణయమని విద్యుత్‌ బోర్డు అధికారులు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Rice Production: సస్యశ్యామల భారతం

Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?

Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - May 20 , 2025 | 01:58 PM