Share News

Air India: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తిరుగు ప్రయాణం రద్దు

ABN , Publish Date - Jun 20 , 2025 | 03:15 PM

ఎయిర్ ఇండియా విమానం వెంటనే ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సి ఉందని, అయితే పక్షి ఢీకొట్టడంతో రిటర్న్ ఫ్లైట్‌ను రద్దు చేశామని ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు బోర్డింగ్ , రీఫండ్ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది.

Air India: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తిరుగు ప్రయాణం రద్దు
Air India Flight

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానాలు వరుస కష్టాలను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి పుణెకు శుక్రవారం ఉదయం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. విమానం సురక్షితంగా పుణెలో ల్యాండ్ అయిందని, సేఫ్టీ చెక్‌లో విమానాన్ని పక్షి ఢీకొట్టినట్టు గుర్తించామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.


ఎయిరిండియా విమానం వెంటనే ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సి ఉందని, అయితే పక్షి ఢీకొట్టడంతో రిటర్న్ ఫ్లైట్‌ను రద్దు చేశామని తెలిపింది. ప్రయాణికులకు బోర్డింగ్ , రీఫండ్ ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ప్రత్యామ్నాయ ఫ్లైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది.


కాగా, పలు అంతర్జాతీయ విమాన సర్వీసులతోపాటు దేశంలో నడిచే వివిధ విమాన సర్వీసులను సైతం రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శుక్రవారంనాడు ప్రకటించింది. విమాన సర్వీసుల భద్రత తనిఖీలు, వాతవరణ పరిస్థితులు, ఆకాశ మార్గంలో విధించిన నిబంధనలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో 15 శాతం అంతర్జాతీయ సర్వీసులను తగ్గించాలని నిర్ణయించినట్టు చెప్పింది. జూన్ 20 నుంచి జూలై ప్రథమార్ధం వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ రూట్లలో విమాన సర్వీసులు రద్దు

For National News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 03:59 PM