Bihar Election Update: బిహార్ ఎన్నికలు.. ఉదయం 9 గంటలకు పోలింగ్ ఎంతంటే?
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:05 AM
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు13.13% శాతం పోలింగ్ నమోదైంది. మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బిహార్, నవంబర్ 6: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు13.13% శాతం పోలింగ్ నమోదైంది. మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్ర మార్పు కోసం, అభివృద్ధి కోసం, ఉద్యోగాల కొరకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. రాష్ట్రంలోని 3.75 కోట్ల మంది ఓటు వేయనున్నారు.
ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ విడతలో 1,314 మంది అభ్యర్థులలో 1,192 మంది పురుషులు, 122 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు, 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో, 8,608 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. వీటితో పాటు 320 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 926 మహిళా నిర్వాహక కేంద్రాలు, 107 దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని 6 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే ముగియనుంది.
ఇవి కూడా చదవండి:
PM Modi-Bihar Election: కంగ్రాట్స్ యంగ్ స్టర్స్.. మొదట ఓటు, తరువాత రిఫ్రెష్‌మెంట్: ప్రధాని మోదీ
Welfare Schemes: రూ.1.68 లక్షల కోట్ల మహిళా పథకాలు