Share News

Bijapur Maoists: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ!

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:42 PM

సొంత దళానికి చెందిన వారిని కూడా అతి కిరాతకంగా చంపేసిన చరిత్ర ఉంది. దినేష్ కొన్నేళ క్రితం అదే దళంలో సభ్యురాలిగా ఉన్న కళా తాటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్ద వారయ్యే కొద్దీ దినేష్‌లో భయం పెరుగుతూ వచ్చింది. దళంలో ఉంటే తనతో పాటు..

Bijapur Maoists: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ!

బీజాపూర్, మార్చి 13: మావోయిజానికి కాలం చెల్లిపోయింది. ప్రజల మంచి కోసం మొదలైన మావోయిజం తర్వాతి కాలంలో నరరూప రాక్షసులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇందుకు దినేష్ మోదియమ్ అనే మావోయిస్టు జీవితమే ఓ ప్రత్యక్ష ఉదాహరణ. దినేష్ లొంగిపోవడానికి ముందు వరకు 100కుపైగా మందిని చంపేశాడు. ఇతగాడు ప్రజా రక్షణకు పెద్ద అడ్డంకిగా మారాడు. 2005 నుంచి దినేష్ అరాచకాలు మొదలయ్యాయి. డబ్బుల కోసం ట్రక్ డ్రైవర్లను, కాంట్రాక్టర్లను, సాధారణ ప్రజలను బెదిరించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే దారుణంగా హింసించే వాడు. అంతటితో అతడి అరాచకాలు ఆగలేదు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపేసేవాడు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవాడు. బీజాపూర్ అడ్డాగా అతడి దారుణాలు సాగేవి. తక్కువ కాలంలోనే దళానికి నాయకుడిగా మారాడు. ఎంతో మంది ప్రజల, పోలీసుల ప్రాణాల్ని బలితీసుకున్న గంగలూర్ కమిటీకి దినేష్ సెక్రెటరీగా పని చేశాడు.


ఈ దళం ఎంత దారుణమైనదంటే.. సొంత దళానికి చెందిన వారిని కూడా అతి కిరాతకంగా చంపేసిన చరిత్ర ఉంది. దినేష్ కొన్నేళ క్రితం అదే దళంలో సభ్యురాలిగా ఉన్న కళా తాటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్ద వారయ్యే కొద్దీ దినేష్‌లో భయం పెరుగుతూ వచ్చింది. దళంలో ఉంటే తనతో పాటు తన కుటుంబానికి కూడా ఎప్పటికైనా మరణం తప్పదని భావించాడు. అందుకే లొంగిపోవడానికి నిశ్చయించుకున్నాడు. 10 రోజుల క్రితం కుటుంబంతో కలిసి పోలీసులకు లొంగిపోయాడు. దళం ఒత్తిడి మేరకే తాను అన్ని నేరాలు చేశానని అతడు పోలీసులకు చెప్పాడు. ఇక, బీజాపూర్ ప్రాంతంలోని మావోయిస్టులు కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు. దినేష్ దారిలోనే మొత్తం 17 మంది పోలీసులకు లొంగిపోయారు. ఇక్కడే ఓ ట్విస్ట్ బయటకు వచ్చింది. మావోయిస్ట్ సబ్ డివిజినల్ జోన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. దినేష్, అతడి భార్య దళానికి సంబంధించిన డబ్బు తీసుకుని పారిపోయారని, పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆ ప్రకటనలో పేర్కొంది.


పెళ్లుబికిన ప్రజా వ్యతిరేకత..

దినేష్ లొంగిపోవడాన్ని గంగలూరు ప్రాంత ప్రజలు సహించలేకపోతున్నారు. మంగళవారం అతడికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో జనం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. దినేష్ 200లకుపైగా మందిని అతి క్రూరంగా చంపేశాడని వారు వాపోయారు. ఆడవాళ్లను, పిల్లలను కూడా వదల్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో మంది ఇళ్లను కూల్చేశాడని, జనం ఊరు విడిచిపారిపోయేలా చేశాడని మండిపడ్డారు. అతడి కారణంగా 152 గ్రామాలు వెనుకబడిపోయాయంటూ బాధపడ్డారు. అలాంటి వాడికి ప్రభుత్వం పునరావాసం కల్పించకూడదని అన్నారు. అతడ్ని వీలైనంత త్వరగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు.


Also Read:

ఎనర్జీ డ్రింక్స్‌తో పిల్లలకు కిడ్నీ సమస్యల ముప్పు!

కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన అమ్మాయి.. చివరకు ఏం జరిగిందంటే..

మీ వద్ద రూ. కోటి ఉన్నాయని హ్యాపీగా ఉన్నారా? రిస్క్‌లో పడ్డట్టే..

For More National News and Telugu News..

Updated Date - Mar 13 , 2025 | 06:42 PM