Viral Auto Driver: కార్పొరేట్ మేనేజర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:05 PM
ఆటోలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ కు వినూత్న అనుభవం ఎదురైంది. కార్పొరేట్ మ్యానేజర్ కంటే ఎక్కువగా ఆటో డ్రైవర్ డబ్బులు సంపాదిస్తున్నాడని తెలిసి ఒక్కసారి అవాక్కయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగుళూరు కు చెందిన ఆకాష్ ఆనందానీ అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బెంగుళూరు, అక్టోబర్ 11: సాధారణంగా ఒక ఆటో డ్రైవర్ మహా అయితే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తుంటాడు. ఇక కొన్నిసార్లు ప్యాసింజర్లు లేకపోతే ఆటోవాలా వరిస్థితి అంతంతే. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో రోజంతా కష్టపడుతూ కుటుంబాన్ని అతికష్టం మీద పోషిస్తుంటాడు ఆటోవాలా. ట్రాఫిక్‌లో నానా అవస్థలు పడుతూ, ప్యాసింజర్ల కోసం ఆరాటపడడడంలోనే రోజంతా గడిచిపోతుంది. ఇంటి ఖర్చులు, అప్పులు పోనూ చేతికి మిగిలేది అంతంతే. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పనక్కర్లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఆటో నడుపుకునే వారి పరిస్థితి మరింత దిగజారింది. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. ఇక చేసేదేం లేక ఆటో నడుపుకోవడమే తమ బ్రతుకుదెరువు అని భావించి, రోజులో ఎక్కువ లాభం రాకపోయినా కష్టంలో బతుకు చక్రాన్ని లాగుతుంటారు.
ఇదిలా ఉంటే.. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్‌కు వినూత్న అనుభవం ఎదురైంది. కార్పొరేట్ మ్యానేజర్ కంటే ఎక్కువగా ఆటో డ్రైవర్ డబ్బులు సంపాదిస్తున్నాడని తెలిసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగుళూరుకు చెందిన ఆకాష్ ఆనందానీ అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చూసి షాక్ తింటున్న యూజర్లు షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఆఫీస్ పనికోసం వెళ్తున్న ఆకాష్ ఆనందానీ, ఆటోలో బయల్దేరాడు. ఆటోవాలా పక్కన కూర్చొని ఆటో నడుపుతుండగా అతని చేతికున్న యాపిల్ వాచ్, ఎయిర్ పోడ్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆటో డ్రైవర్‌కి యాపిల్ వాచ్ ఏంటని.. పూర్తి విషయాలు తెలుసుకుందామని అతనిని అడిగాడు.
ఆటోడ్రైవర్ సమాధానాలు విని ఆ ప్యాసింజర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తనకు రూ.4-5 కోట్ల విలువచేసే రెండు ఇళ్లు ఉన్నాయని, వాటిని అద్దెకు ఇస్తే నెలకు రూ.2-3 లక్షల ఆదాయం వస్తుందని ఆటోవాలా చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆర్టిఫిషల్ ఇంటెలీజెన్స్(AI) స్టార్టప్ కంపెనీలో భారీ పెట్టుబడి సైతం పెట్టినట్లు చెప్పాడు. వారం మొత్తం తాను ఆటో నడపనని.. కేవలం వారాంతంలో మాత్రమే తాను ఆటో నడుపుతానని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ చెప్పిన విషయాలకు నివ్వెరపోయిన ఆ ప్యాసింజర్.. ఈ విషయాన్ని సొషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి:
Raja Sing: డీజీపీకి రాజాసింగ్ లేఖ.. కేసులు ఎలా పెడతారని ప్రశ్న?
Assembly Elections: మాజీసీఎం ఈపీఎస్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..