Share News

Amit Shah: బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ రికార్డు బద్ధలు కొట్టిన అమిత్ షా

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:08 PM

14 ఏళ్ళ వయసులో ఆర్.ఎస్.ఎస్‌లో చేరడంతో ప్రారంభమై, గుజరాత్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా ప్రస్థానం కొనసాగుతోంది.

Amit Shah: బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ రికార్డు బద్ధలు కొట్టిన అమిత్ షా
Amit Shah

ఢిల్లీ, ఆగష్టు 5 : భారతదేశ రాజకీయ చరిత్రలో కేంద్ర హోం మంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించారు. 2019 మే 31 నుంచి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, ఆరు సంవత్సరాల 64 రోజులకు పైగా ఈ పదవిలో కొనసాగుతూ, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ (1998-2004) రికార్డును అధిగమించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహిత సహచరుడిగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక వ్యూహకర్తగా అమిత్ షా పేరుగాంచారు.

Amit-Shah.jpg


గుజరాత్‌లో హోం మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తన నాయకత్వ నైపుణ్యాన్ని చాటుకున్న అమిత్ షా, 2019లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హోం మంత్రిగా కొనసాగుతున్నారు. అమిత్ షా హయాంలో ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం నిర్మూలనకు కఠిన చర్యలు, అంతర్గత భద్రత బలోపేతం వంటి కీలక నిర్ణయాలు ఆయన హయాంలోనే తీసుకున్నారు. మణిపూర్‌లో జాతుల ఘర్షణల సమయంలో రాష్ట్రపతి పాలన విధించడం వంటి సందర్భాల్లోనూ అమిత్ షా నిర్ణయాత్మక పాత్ర పోషించారు.


ఇక, అమిత్ షా రాజకీయ ప్రస్థానం 14 ఏళ్ళ వయసులో ఆర్.ఎస్.ఎస్‌లో చేరడంతో ప్రారంభమై, గుజరాత్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగింది. 2019లో గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన అమిత్ షా, కేంద్ర సహకార శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రికార్డుతో అమిత్ షా భారత రాజకీయాల్లో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. దేశ అంతర్గత భద్రత, రాజకీయ స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

Amit-Shah-1.jpg


ఇవి కూడా చదవండి..

మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన, రాజ్యసభ ఆమోదం

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 05:20 PM