Share News

Kejriwal Old Video: మోదీ ఈ జన్మలో తమను ఓడించలేరన్న కేజ్రీవాల్.. పాత వీడియో నెట్టింట వైరల్

ABN , Publish Date - Feb 08 , 2025 | 05:15 PM

తమను ఓడించాలంటే మోదీ మరో జన్మ ఎత్తాలంటూ గతంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

Kejriwal Old Video: మోదీ ఈ జన్మలో తమను ఓడించలేరన్న కేజ్రీవాల్.. పాత వీడియో నెట్టింట వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ఘన విజయం ఆప్‌కు గట్టి షాకిచ్చింది. బీజేపీ తమను ఓడించడం అసాధ్యమంటూ గతంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ పలుమార్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది 2023 నాటి వీడియో. లిక్కర్ కుంభకోణం కేసులో తన పేరు చేర్చిన సందర్భంగా కేజ్రీవాల్ ఓ సభలో మాట్లాడుతూ మోదీ తమను ప్రజాక్షేత్రంలో ఓడించలేరని ఘంటపథంగా చెప్పుకొచ్చారు (Kejriwal Old Video Viral).


Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

పార్టీ వర్కర్లను ఉద్దేశించిన ప్రసంగంలో కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆప్ ప్రభుత్వం కూలదోయాలని వారు భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీ గారు యోచిస్తున్నారు. కానీ నేను మోదీ గారికి చెప్పేదేంంటే.. మీరు ఈ జన్మలో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఓడించలేరు. ఢిల్లీలో విజయం కోసం మీరు మరో జన్మ ఎత్తాలి’’ అని కేజ్రీవాల్ అప్పట్లో బీజేపీకి సవాలు విసిరారు. ఇక తాజా ఎన్నికల్లో ఆప్ చిత్తుచిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో నాటి వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


BJP Victory: ఢిల్లీ విజయాన్ని కట్టబెట్టిన బీజేపీ వ్యూహం ఇదీ!

ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖరారైపోయిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో 47 బీజేపి సొంతమవడంతో మ్యాజిక్ ఫిగర్ 36ను కమలం పార్టీ సునాయాసంగా అధిగమించింది. మరోవైపు ఆప్ 22 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఆప్ ఓటమితో పాటు పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా కూడా ఓటమి చెందడం పార్టీకి భారీ షాక్ మిగుల్చింది. కేజ్రీవాల్‌పై బీజేపీ నేత పర్వేశ్ సింగ్ సాహిబ్, శిశోడియాపై తర్వీందర్ సింగ్ మార్వా విజయం సాధించారు. ఇక దేశ రాజధానిలో దాదాపు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి కూడా ఖాతా తెరవలేక చతికిల పడింది.

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2025 | 06:14 PM