Share News

Supreme Court: హైకోర్టు న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్: సుప్రీం ఆదేశం

ABN , Publish Date - May 19 , 2025 | 04:40 PM

హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సంవత్సరానికి రూ.15 లక్షలు పెన్షన్ చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది. కొంతమంది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు తక్కువ పెన్షన్ ఇస్తుండటంపై ప్రధాన న్యాయమూర్తి సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Supreme Court: హైకోర్టు న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్: సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: అదనపు న్యాయమూర్తులతో సహా హైకోర్టు న్యాయమూర్తులందరికీ (High Court Judges) పూర్తి స్థాయిలో సమాన పెన్షన్ అందజేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) కేంద్రాన్ని సోమవారం నాడు ఆదేశించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సంవత్సరానికి రూ.15 లక్షలు పెన్షన్ చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది. కొంతమంది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు తక్కువ పెన్షన్ ఇస్తుండటంపై ప్రధాన న్యాయమూర్తి సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ''ఒకే ర్యాంకు ఒకే పెన్షన్' (One rank, one pension)ను వర్తింపజేయాలని స్పష్టం చేసింది.

Supreme Court: ఈ దేశం ధర్మశాల కాదు.. శ్రీలంక పౌరుని పిటిషన్‌‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు..


ఉద్యోగంలో చేరిన తేదీ, వారు అడిషనల్ జడ్జిలుగా రిటైర్ అయ్యారా, ఆ తర్వాత పర్మనెంట్ పోస్టులు ఇచ్చారా? అనే దానితో ప్రమేయం లేకుండా జడ్జిలందరికీ పూర్తి పెన్షన్ చెల్లించాలని జస్టిస్ అగస్టిన్ జార్జి అభిప్రాయపడ్డారు. జడ్జీలు చేరిన సమయం, డిజిగ్నేషన్ ఆధారంగా వ్యత్యాసం చూపడం సమానత్వమనే ప్రాథమిక హక్కుకు విరుద్ధమని అన్నారు. శాశ్వత న్యాయమూర్తులకు ఇచ్చే పెన్షన్, రిటైర్‌మెంట్ ప్రయోజనాలనే మృతిచెందిన అదనపు హైకోర్టు న్యాయమూర్తుల కుటుంబాలకూ ఇవ్వాలని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.


టెర్మినల్ ప్రయోజనాల కోసం పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తుల మధ్య ఎలాంటి వివక్ష చూపినా అది ఆర్టికల్ 14న ఉల్లంఘించినట్టు అవుతుందని సీజేఐ పేర్కొన్నారు. అన్ని హైకోర్టుల న్యాయమూర్తులకు వారు ఎప్పుడు ప్రవేశించారనే దానితో సంబంధం లేకుండా పూర్తి పెన్షన్ పొందడానికి అర్హులని చెప్పారు. బార్ నుంచి ఎలివేట్ అయిన వారికి, జిల్లా జ్యుడిషియరీకి ప్రమోట్ అయిన వారికి మధ్య వ్యత్యాసం లేదని, న్యూ పెన్షన్ స్కీమ్‌ కింద ప్రయోజనాలన్నింటినీ జడ్జిలకు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అడిషనల్ జడ్జీలుగా రిటైర్ అయిన హైకోర్టు జడ్జీలందరికీ పూర్తి పెన్షన్ ఇవ్వాలని పేర్కొంది. అదనపు న్యాయమూర్తులతో సహా హైకోర్టు న్యాయమూర్తులందరికీ సంవత్సరానికి రూ.13.50 లక్షలు పూర్తి పెన్షన్ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 05:38 PM