Ajit Doval: పాకిస్తాన్‌లో ఏడేళ్లు 'స్పై' గా ఉన్న అజిత్ దోవల్‌కు ఎదురైన ప్రశ్న
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:42 PM
1980ల చివర్లో భారత పోలీస్ అధికారి అజిత్ దోవల్ పాకిస్తాన్‌లో స్పై గా దాదాపు 7 సంవత్సరాలు గడిపారు. లాహోర్‌లో ఒకసారి మసీదు నుంచి తిరిగి వస్తుండగా, గడ్డం ఉన్న ఒక వృద్ధుడు ఆయన్ని పిలిచి..'తుమ్ హిందూ హో?'అని..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 16: భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పాకిస్తాన్‌లో అండర్‌కవర్ ఆపరేషన్ సమయంలో ఎదుర్కొన్న ఒక ఉత్కంఠ భరిత సంఘటన మళ్లీ చర్చనీయాంశమైంది. ఇటీవల విడుదలైన స్పై థ్రిల్లర్ సినిమా 'ధురంధర్' ఈ రియల్ లైఫ్ స్పై స్టోరీలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చింది.
1980ల చివర్లో అజిత్ దోవల్ పాకిస్తాన్‌లో మారు వేషంలో దాదాపు 7 సంవత్సరాలు గడిపారు. లాహోర్‌లో ఒకసారి మసీదు నుంచి తిరిగి వస్తుండగా, గడ్డం ఉన్న ఒక వృద్ధుడు ఆయన్ని పిలిచి, 'తుమ్ హిందూ హో?' (నువ్వు హిందువువా?) అని ప్రశ్నించాడు. దోవల్ తిరస్కరించినా, వృద్ధుడు ఆయన చెవులకు ఉన్న మచ్చలను చూపించి – ఇది కొన్ని ప్రాంతాల్లో హిందూ బాలుడికి చేసే సంప్రదాయమని చెప్పాడు.
అయితే, దీనికి దోవల్ సమర్థంగా సమాధానమిచ్చారు: 'హా, మై జబ్ పైదా హుఆ థా తబ్ మై థా, బాద్ మై మై కన్వర్ట్ హుఆ హూ' (అవును, పుట్టినప్పుడు నేను హిందువునే, తర్వాత మతం మార్చుకున్నాను). అని సమాధానమిచ్చారు దోవల్. కానీ వృద్ధుడు ఒప్పుకోలేదు. 'నువ్వు ఇలా తిరగడం సేఫ్ కాదు, చెవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో' అని సలహా ఇచ్చాడు.
తర్వాత వృద్ధుడు తన గదిలోని అల్మారా తెరిచి శివ, దుర్గామాత విగ్రహాలు చూపించాడు. కమ్యూనల్ హింసలో తన కుటుంబం మొత్తం మరణించడంతో, తాను వేషం మార్చి జీవిస్తున్నానని, కానీ ఇంకా హిందువునే అని బయటపెట్టాడు. 'మై భీ హిందూ హూ' అని చెప్పాడు.
ఈ సంఘటనను దోవల్ ఒక పబ్లిక్ ఈవెంట్‌లో షేర్ చేశారు. 'ధురంధర్' సినిమా (రణవీర్ సింగ్, ఆర్. మాధవన్ నటించిన)లో మాధవన్ పాత్ర దోవల్ ఆధారితమని భావిస్తున్నారు. సినిమా విడుదలై 10 రోజుల్లోనే రూ.350 కోట్లు దాటి బాక్సాఫీస్‌లో సంచలనం సృష్టించింది.
దోవల్ లాంటి రియల్ హీరోల అన్‌సంగ్ స్టోరీలు సినిమా ద్వారా మళ్లీ చర్చలోకి వచ్చాయి. ఇది 'ధురంధర్' మూవీ విజయానికి మరో కారణం!
ఇవి కూడా చదవండి:
Abhijnaan Kundu: అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్