Share News

Air India Offers Discounts: ఎయిరిండియా విమానాల్లో వృద్ధులకు టికెట్‌పై రాయితీ

ABN , Publish Date - Sep 03 , 2025 | 02:57 AM

ఎయిరిండియా విమానయాన సంస్థ 60 ఏళ్లు పైబడిన(సీనియర్‌ సిటిజన్లు)వారికి టికెట్‌ ధరపై రాయితీ ప్రకటించింది...

Air India Offers Discounts: ఎయిరిండియా విమానాల్లో వృద్ధులకు టికెట్‌పై రాయితీ

  • అంతర్జాతీయ సర్వీసుల్లో 10 శాతం, దేశీయ సర్వీసుల్లో 25 శాతం దాకా..

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఎయిరిండియా విమానయాన సంస్థ 60 ఏళ్లు పైబడిన(సీనియర్‌ సిటిజన్లు)వారికి టికెట్‌ ధరపై రాయితీ ప్రకటించింది. అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్‌ మూల ధరపై 10ు వరకు, దేశీయ సర్వీసుల్లో అయితే 25ు వరకు రాయితీ ఇస్తామని వెల్లడించింది. ఎకనామీ, బిజినెస్‌ క్లాస్‌ సహా అన్ని రకాల టికెట్లపై ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ రాయితీ పొందాలంటే ఎయిరిండియా వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో టికెట్‌ బుకింగ్‌ అప్పుడే ‘కన్‌సెషన్‌ టైప్‌’ దగ్గర సీనియర్‌ సిటిజన్‌ కోటాను తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి. ఈ రాయితీతోపాటు సాధారణం కంటే 10 కిలోల వరకు అదనపు లగేజీని సీనియర్‌ సిటిజన్లు తీసుకెళ్లే అవకాశాన్ని కూడా ఎయిరిండియా ఇస్తుంది. అంతేకాక, సీనియర్‌ సిటిజన్లు తమ ప్రయాణ తేదీని ఓసారి ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. అయితే, మార్పు చేసుకున్న ప్రయాణ తేదీలో టికెట్‌ ధర అధికంగా ఉంటే మాత్రం ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 02:57 AM