Air India: ఎయిరిండియా విమానం బ్లాక్‌బాక్స్ అమెరికాకు
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:13 AM
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎయిరిండియా సంస్థ.. తాను నడిపే పలు అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది...
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ విమాన బ్లాక్‌బాక్స్‌లోని డేటా విశ్లేషణకు కేంద్రం దానిని అమెరికాకు పంపనుంది. ప్రమాద సమయంలో రికార్డర్ బయటి భాగం తీవ్రంగా దెబ్బతినడంతో అందులోని సమాచారాన్ని సేకరణ దర్యాప్తు బృందాలకు కష్టంగా మారింది. దీంతో దాన్ని వాషింగ్టన్‌లోని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎ్‌సబీ)కు చెందిన ప్రయోగశాలకు పంపనున్నారు.
ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులు తాత్కాలిక తగ్గింపు
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎయిరిండియా సంస్థ.. తాను నడిపే పలు అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. అలాగే 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే బోయింగ్ 747వంటి భారీ విమానాల వాడకాన్ని జూలై 21దాకా 15శాతం తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. కాగా 130 మంది ప్రయాణికులతో గురువారం ఢిల్లీ నుంచి వియత్నాం బయలుదేరిన ఎయిరిండియా ఎయిర్‌బస్ ఏ320 నియో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్యలతో తిరిగి ఢిల్లీలో ల్యాండయ్యింది. ఢిల్లీ నుంచి లేహ్‌కు బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యలతో ఢిల్లీకి తిరిగివచ్చింది.