Share News

Ahmedabad Plane Crash: విమాన ప్రమాద దృశ్యాలు..

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:11 PM

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 242 మంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని..

Ahmedabad Plane Crash: విమాన ప్రమాద దృశ్యాలు..
Ahmedabad Plane Crash

Air India Plane Crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 242 మంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. ఈ విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో హాస్టల్‌లోని మెడికోలు చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం ఎలా జరిగింది.. సాంకేతిక సమస్య కారణంగా జరిగిందా.. ఏదైనా కుట్ర దాగుందా.. అనే కోణంలో దర్యాప్తు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.


కాగా, ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది మొదలు.. ప్రమాదానికి గురైన తీరుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయినట్లుగా కొన్ని విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. 600 అడుగులపైగా ఎత్తుకు దూసుకెళ్లిన విమానం.. క్షణాల్లో జనావాసాలపై కుప్పకూలి పేలిపోవడం కొన్ని వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ని మీకోసం అందిస్తున్నాం.


విమాన ప్రమాదానికి సంబంధించి ఎక్స్‌లో వైరల్ అవుతున్న వీడియోలు..


గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని చివరి ఫోటో..


విమానం కూలిన ప్రాంతంలో ఎగసిపడుతున్న మంటలు..


సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బంది..

Updated Date - Jun 12 , 2025 | 06:15 PM