Actress Ranjana: బీజేపీకి నటి రంజనా నాచ్చియార్ గుడ్‌బై..
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:22 AM
బీజేపీ రాష్ట్ర కళా సాంస్కృతిక విభాగ కార్యదర్శి, నటి రంజనా నాచ్చియార్(Actress Ranjana Nachiyar) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

చెన్నై: బీజేపీ రాష్ట్ర కళా సాంస్కృతిక విభాగ కార్యదర్శి, నటి రంజనా నాచ్చియార్(Actress Ranjana Nachiyar) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదేళ్లపాటు పార్టీ కోసం తీవ్రంగా పాటుపడ్డానని, దేశభక్తి కలిగిన, జాతీయవాదాన్ని పరిరక్షించే, ఆధ్యాతిక భావాలు కలిగిన పార్టీ అనే నమ్మకంతో బీజేపీలో చేరానని తెలిపారు. అయితే ఆ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తోందని గ్రహించానన్నారు. దేశం వేరు రాష్ట్రం వేరు అనే విరుద్ధభావాలు కలిగిన పార్టీలో తమిళ మగువ కొనసాగకూడదని పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని వెల్లడించారురు.
ఈ వార్తను కూడా చదవండి: Rajinikanth: ఎవరికోసం ‘రజనీ’ వ్యూహం.. బీజేపీ కూటమి బలోపేతానికి తలైవా యత్నం
రాష్ట్రంలో త్రిభాష విద్యావిధానాన్ని అమలు చేయాలని ఒత్తిడి చేయడం, నిర్బంధ హిందీని దొడ్డిదారిలో అమలు చేయాలని ప్రయత్నించడం వంటి ఘటనలు చూసి సహించలేకపోయానన్నారు. రంజనా నాచ్చియార్ కొన్నేళ్ల క్రితం ఎంటీసీ బస్సులో ఫుట్‌బోర్డులో ప్రయాణం చేసిన విద్యార్థులపై దాడి చేసి తీవ్ర కలకలం రేపారు. ఆ కేసులో అరెస్టు కావడాన్ని కూడా ఆమె సమర్థించుకున్నారు. మంచి విషయాల కోసం అరెస్టు కావడంలో తప్పులేదని ప్రకటించారు. ఆ కేసులో అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు.
ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్?
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
Read Latest Telangana News and National News