AC suburban train: ‘ఏసీ’ సబర్బన్ రైలు ట్రయల్ రన్..
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:37 PM
నగరంలో నడుపనున్న తొలి ‘ఏసీ’ సబర్బన్ రైలు(AC suburban train) ట్రయల్ రన్ మంగళవారం నిర్వహించారు. చెన్నై బీచ్-చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ రైలు(Chennai Beach-Chengalpattu Express Train) మార్గంలో ‘ఏసీ’ సబర్బన్ రైలు నడపాలని దక్షిణ రైల్వే 2019లో రైల్వే బోర్డుకు విజ్ఞప్తి చేసింది.
చెన్నై: నగరంలో నడుపనున్న తొలి ‘ఏసీ’ సబర్బన్ రైలు(AC suburban train) ట్రయల్ రన్ మంగళవారం నిర్వహించారు. చెన్నై బీచ్-చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ రైలు(Chennai Beach-Chengalpattu Express Train) మార్గంలో ‘ఏసీ’ సబర్బన్ రైలు నడపాలని దక్షిణ రైల్వే 2019లో రైల్వే బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఆ ప్రకారం, దక్షిణ రైల్వే చెన్నై డివిజన్‌కు రెండు ఏసీ సబర్బన్ రైళ్లు(AC suburban trains) తయారుచేయాలని ఐసిఎఫ్కు రైల్వే బోర్డు ఆదేశించింది.
ఈ వార్తను కూడా చదవండి: Ramdas: అక్కడే రెండో విమానాశ్రయం ఏర్పాటు చేయండి

ప్రస్తుతం ఏసీ సబర్బన్ రైలు తయారవడంతో, మంగళవారం ఐసిఎఫ్ ప్రాంగణంలో ట్రయల్ రన్ నిర్వహించారు. 12 బోగీలతో కూడిన ఈ రైలులోని భద్రతా అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రైలును త్వరలో దక్షిణ చెన్నై డివిజన్ అధికారులకు అప్పగించనున్నారు. అనంతరం ఎక్స్‌ప్రెస్ రైలు(Express train) మార్గంలో 110 కి.మీ వేగంతో ఈ రైలు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరో రెండు నెలల్లో ఏసీ సబర్బన్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి
ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు
ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?
Read Latest Telangana News and National News