Share News

Stray Dogs: ఎస్సై మరణానికి కారణమైన వీధి కుక్క.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:56 PM

ప్రస్తుతం వీధి కుక్కల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. వీధి కుక్కల వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని కొందరు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్లలోకి తరలించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు.

Stray Dogs: ఎస్సై మరణానికి కారణమైన వీధి కుక్క.. అసలేం జరిగిందంటే..
UP Cop

ప్రస్తుతం వీధి కుక్కల (Stray Dogs) గురించి జోరుగా చర్చ జరుగుతోంది. వీధి కుక్కల వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని కొందరు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్లలోకి తరలించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లో ఓ వీధి కుక్క ఓ పోలీస్ అధికారి (UP Cop) మరణానికి కారణమైంది.


యూపీలోని కవినగర్ పోలీస్ స్టేషన్‌లో డ్యూటీ ముగించుకుని ఇంటికి బైక్ పై బయల్దేరిన సబ్-ఇన్‌స్పెక్టర్ రిచా సచన్ (25) సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యారు. అకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చిన ఓ వీధి కుక్కను రిచా బైక్ ఢీకొట్టింది. దీంతో రిచా బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడిపోయారు. వెనుక వస్తున్న కారు రిచా పైనుంచి దూసుకెళ్లిపోయింది. రిచా హెల్మెట్ ధరించినప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో ఆమె చనిపోయింది.


సమాచారం అందుకున్న పోలీసులు రిచాను సర్వోదయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. కాన్పూర్‌కు చెందిన రిచా 2023లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమె శాస్త్రి నగర్ అవుట్ పోస్ట్ ఛార్జ్‌ని చూసుకుంటూనే యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి

జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 02:57 PM