Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముగిసిన పోలింగ్.. మరికొన్ని నిమిషాల్లోనే..
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:29 PM
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ముగిసింది. రాత్రి 7 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, 97 శాతం పోలింగ్ నమోదైంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ముగిసింది. రాత్రి 7 గంటలకు ఫలితాలు వెలువడతాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో 97 శాతం పోలింగ్ నమోదైంది. 768 మంది ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. 13 మంది మినహా మిగతా ఎంపీలంతా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార NDA కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి బి.సుదర్శన్‌రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎంతో ఉత్కఠంగా సాగిన ఎన్నికల ఫలితాలు మరికొన్ని నిమిషాల్లో తేలనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News