Big Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
ABN , Publish Date - Aug 25 , 2025 | 09:13 AM
యాత్రికులతో వెళ్తన్న ట్రాక్టర్ ట్రాలీని కాంటర్ ట్రక్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.
లక్నో, ఆగస్టు 25: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీని కాంటర్ ట్రక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 43 మందికి తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్లుతున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
కస్గంజ్ జిల్లాలోని రాఫత్‌పూర్ నుంచి రాజస్థాన్‌లోని జహర్‌పీర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ వెల్లడించారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 61 మంది యాత్రికులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో కాంటర్ ట్రక్ వేగంగా ఢీ కొట్టడంతో.. ట్రాక్టర్ ట్రాలీ తిరగబడిందన్నారు. దీంతో క్షతగాత్రుల సంఖ్య భారీగా పెరిగిందని వివరించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులంతా వివిధ ఆసుపత్రులు.. అలీఘడ్ మెడికల్ కాలేజీ, బులంద్‌షార్ జిల్లా ఆసుపత్రి, కుర్జాలోని కైలాష్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. బులంద్‌షహర్- అలీఘడ్ సరిహద్దుల్లోని అర్నియా బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. అయితే ఈ ప్రమాద ఘటన నుంచి 10 మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారని తెలిపారు.
మృతులను గుర్తించామని చెప్పారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. గాయపడిన వారిలో 12 మంది చిన్నారులు సైతం ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకోగానే జిల్లా కలెక్టర్ శృతి సైతం ఘటన స్థలానికి చేరుకుని.. సహయక చర్యలు పర్యవేక్షించారు.ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎక్కడ తక్కువకు వస్తే అక్కడే ఆయిల్ తీసుకుంటాం.. తేల్చి చెప్పిన వినయ్ కుమార్
గాజాలో ఆగని ఆకలి చావులు.. 290 మంది మృతి
For National News And Telugu News