Share News

79th Independence Day Celebrations: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జ్ఞానపథ్ సిద్ధం.. 5 వేల మంది గెస్టులు, మోదీ స్పీచ్

ABN , Publish Date - Aug 14 , 2025 | 06:57 AM

మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామ విజయం, సాహస గాథకు 79 ఏళ్లు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి నుంచి ప్రధాని మోదీ స్పీచ్ సహా పండుగ వెలుగులు విరజిమ్మబోతున్నాయి. అయితే ఈసారి జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

79th Independence Day Celebrations: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జ్ఞానపథ్ సిద్ధం.. 5 వేల మంది గెస్టులు, మోదీ స్పీచ్
79th Independence Day Celebrations

మన భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం రేపు (ఆగస్టు 15) ఘనంగా (79th Independence Day Celebrations 2025) జరగనుంది. ఈ ఏడాది, ఈ పండుగను మరింత ఘనంగా జరుపుకోవడానికి దేశం సిద్ధమైంది. ఈసారి న్యూ ఇండియా థీమ్‌తో, దేశవ్యాప్తంగా 140కి పైగా ప్రదేశాల్లో సైనిక, పారామిలిటరీ దళాలు ఆపరేషన్ సిందూర్ విజయం పేరుతో అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయి. ఈ వేడుకలు మన దేశ ఐక్యత, అభివృద్ధి, స్వావలంబన స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే, ఈ గ్రాండ్ ఈవెంట్‌ కోసం 5000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.


దేశవ్యాప్తంగా ఉత్సవం

ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం ఎందుకంత స్పెషల్ అంటే, మొదటిసారిగా భారత సైన్యం, నేవీ, వైమానిక దళం, కోస్ట్ గార్డ్, NCC, CRPF, BSF, ITBP, CISF, SSB, RPF, అస్సాం రైఫిల్స్ వంటి దళాల బ్యాండ్‌లు దేశవ్యాప్తంగా 96 నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయి. ఈ బ్యాండ్‌ల సంగీతం దేశ బలం, ఐక్యతను చాటి చెబుతుంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఇండియా గేట్, కర్తవ్య పథ్, విజయ్ చౌక్, పురానా ఖిలా, నిజాముద్దీన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల వంటి ఐకానిక్ ప్రదేశాలు ఈ వేడుకలతో కళకళలాడనున్నాయి.


దేశం దిశగా ఒక అడుగు

ఈసారి స్వాతంత్ర దినోత్సవ థీమ్ న్యూ ఇండియా. ఈ థీమ్ మన దేశం ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందుతోందని, 2047 నాటికి పూర్తిగా బలమైన, స్వావలంబన దేశంగా మారాలనే లక్ష్యాన్ని సూచిస్తోంది. ఈ వేడుకల నేపథ్యంలో ప్రజలు దేశభక్తి స్ఫూర్తితో నృత్యాలు చేస్తూ, మన దేశ ఉజ్వల భవిష్యత్తును జరుపుకోనున్నారు.

సన్నాహాలు పక్కాగా పూర్తి

స్వాతంత్ర దినోత్సవ సన్నాహాల గురించి చెప్పాలంటే, అన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. బుధవారం గ్రాండ్ రిహార్సల్ కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు 2,500 మంది మహిళా, పురుష క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు న్యూ ఇండియా లోగోను తయారు చేస్తూ అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తారు.


5000 మందికి ఆహ్వానం

ఈసారి వేడుకలను మరింత గొప్పగా చేసేందుకు 5000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో స్పెషల్ ఒలింపిక్స్ 2025లో పాల్గొన్న క్రీడాకారులు, అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన అథ్లెట్లు, ఖేలో ఇండియా పారాగేమ్స్ బంగారు పతక విజేతలు, జాతీయ తేనెటీగల పెంపకం మిషన్‌లో ఉత్తమ రైతులు, పోటీల్లో గెలిచిన విద్యార్థులు ఉన్నారు. అంతేకాదు పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ కార్మికులు, లఖ్‌పతి దీదీ పథకం లబ్ధిదారులు కూడా ఈ వేడుకల్లో భాగమవుతారు. ఆహ్వాన కార్డులపై ఆపరేషన్ సింధూర్ లోగోతో పాటు, న్యూ ఇండియా పురోగతికి చిహ్నంగా ఉన్న చీనాబ్ వంతెన చిత్రం కూడా ఉంది.

ప్రధాని మోదీ సందేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన సందేశం న్యూ ఇండియా బలం, స్వావలంబన గురించి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 07:18 AM